పెళ్లి చేసుకుంటానని మాయమాటలు..రూ.కోటి కొట్టేసిన కిలాడీ..

Update: 2023-07-31 15:38 GMT

ఫేక్‌ ప్రొఫైల్‌తో ఓ యువకుడి నుంచి దాదాపు కోటి రూపాయలను కాజేసిన యువతి ఘటన బెంగళూరులో జరిగింది. ఓ మ్యాట్రీమోనీ సైట్‌‎లో ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి, మోసానికి పాల్పడింది యువతి . బెంగళూరు నివాసి అయిన యువకుడు యూకేలో సాఫ్ట్‎వేర్ జాబ్ చేస్తున్నాడు. ట్రైనింగ్ నిమిత్తం ఈ మధ్యనే యూకే నుంచి సొంతూరుకు వచ్చాడు. ఈ క్రమంలోనే పెళ్లి చేసుకోవాలనుకుని ఓ మ్యాట్రిమోనీ సైట్‎లో రిజిస్టర్ అయ్యాడు. సైట్‌లో ఒక యువతితో యువకుడికి పరిచయం ఏర్పడింది. ఫోన్లో తరచుగా వీరిద్దరూ మాట్లాడుకునేవారు. తనకు తండ్రి లేడని, అమ్మతోనే ఉంటున్నానని నిన్నే పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పడంతో ఆమె బుట్టలో పడిపోయాడు. మొత్తానికి వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు.

అయితే ఈ సమయంలోనే తన తల్లి ఆరోగ్యం బాగోలేదని ఆస్పత్రికి వెళ్లేందుకు రూ. 1500లు కావాలని ఆ యువకుడికి ఫోన్ చేసింది. వెంటనే యువకుడు డబ్బు పంపించాడు. ఆ తరువాత రెండు రోజులకు ఆ యువత నగ్నంగా అతడికి వీడియో కాల్‌ చేసింది. ఈ సమయలోనే అతడికి తెలియకుండా రికార్డు చేసింది. ఆ తరువాత ఆ క్లిపింగ్‌ను అతడికి షేర్‌ చేసి , అడిగినంతా సొమ్ము ఇవ్వకపోతే మీ పేరెంట్స్‎కు పంపిస్తానంటూ బెదిరింది. దీంతో ఎక్కడ పరువుపోతుందోనని భయపడిన యువకుడు రూ. కోటికి పైగా ఆ యువతికి అప్పజెప్పాడు. అయినా ఆ యువతి వేధింపులు ఆగలేదు. దీంతో సైబర్‌ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు రంగంలకి దిగారు. ఆ యువత బ్యాంక్‌ అకౌంట్లను బ్లాక్ చేవారు. ఆ విధంగా రూ. 84 లక్షలను ఆమె వినియోగించడానికి వీలు లేకుండా చేశారు. ఇప్పటి వరకు సదరు యువత రూ. 30 లక్షల వరకు ఖర్చు చేసింది. యువకుడి ఫిర్యాదుతో ఆమె ఖాతాను బ్లాక్ చేశారు.

Tags:    

Similar News