మాజీ ప్రియుడిని ఇరికించేందుకు యువతి ప్లాన్.. చివరకు..

By :  Bharath
Update: 2023-12-26 12:20 GMT

మాజీ ప్రియుడిపై ఓ ప్రేయసి పగబట్టి.. ప్రతీకారానికి వేసిన ప్లాన్ ఆసక్తికరంగా మారింది. అతని కారులో గంజాయి పెట్టి.. పోలీసులకు ఇరికించే ప్లాన్ బెడిసికొట్టింది. తన ప్లాన్ తెలిసిన పోలీసులు నివ్వెరపోయారు. రంగంలోకి దిగి ఆ యువతిని అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ లోని రహమత్ నగర్ లో నివాసం ఉంటున్న రింకీ.. అమీర్ పేట్ లోని ఓ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తుంది. సరూర్ నగర్ కు చెందిన శ్రవణ్ కూడా అదే అక్కడే పనిచేస్తున్నుడు. వీరిద్దరు గత కొంత కాలంగా ప్రేమలో ఉండగా.. కొన్నాళ్లుగా శ్రవణ్ ఆమెను దూరం పెడుతూ వచ్చాడు. దాంతో అతనిపై పగ పెంచుకుని.. శ్రవణ్ ను ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలనుకుంది. ఈ నేపథ్యంలో గంజాయి కేసులో ఇరికించేందుకు ప్రయత్నించింది.

తన స్నేహితుడితో కలిసి రూ.4 వేల గంజాయి (40 గ్రాములు) కొనుగోలు చేసింది రింకీ. దాన్ని 8 గ్రాముల చొప్పున ఐదు ప్యాకెట్లుగా తయారుచేసింది. తర్వాత తన స్నేహితునితో శ్రవణ్ కు ఫోన్ చేయించి ఓ పార్క్ వద్దకు రప్పించింది. అనంతరం అంతా కలిసి జూబ్లిహిల్స్ లోని ఓ పబ్ కు వెళ్లారు. అంతా పబ్ లో ఉన్న టైంలో.. రింకీ శ్రవణ్ కారులో గంజాయి ప్యాకెట్లు పెట్టింది. అనంతరం తెలిసిన కానిస్టేబుల్ కు ఫోన్ చేసి.. శ్రవణ్ గంజాయి అమ్ముతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫలానా ప్లేస్ లో, ఫలానా నెంబర్ ఉన్న కారులో గంజాయి ప్యాకెట్లు ఉన్నాయని పోలీసులకు వివరాలందించి. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కారులో తనిఖీలు నిర్వహించి శ్రవణ్ ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల దర్యాప్తులో శ్రవణ్ కారు తనది కాదని, వేరేవాళ్ల కారులో వచ్చానని చెప్పాడు. దీంతో ఆ కారులో వచ్చిన వారందరినీ పోలీసులు విచారించగా.. అసలు వాస్తవాలు బయటపడ్డాయి. తనను దూరం పెట్టినందుకు శ్రవణ్ పై కక్ష కట్టేందుకే ఇలా చేసినట్లు రింకీ ఈ నిజం ఒప్పుకుంది. ఈ కేసులో పోలీసులు రింకీతో సహా తన స్నేహితులను అరెస్ట్ చేశారు.




Tags:    

Similar News