వర్షాకాలం వచ్చింది.. అంటురోగాలు తెచ్చింది.. వీటి నుంచి తప్పించుకోవాలంటే..?

Update: 2023-07-19 10:57 GMT

వర్షాకాలం వచ్చిదంటే చాలు.. రోగాలు మొదలవుతాయి. వేసవి తాపం తీరుతుంది అనుకునే లోపే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. డెంగ్యూ, మలేరియా, సీజనల్ ఫ్లూ, టైఫాయిడ్ లాంటి రోగాలు.. తోడుగా మేమున్నాం అంటూ వచ్చేస్తుంటాయి. మరికొందరికి సీజన్ కాస్త చల్లబడి, నాలుగు చినుకులు పడ్డాయంటే చాలు.. జలుబు, దగ్గు, జ్వరం మొదలవుతాయి. అయితే, కొన్ని రకాల పండ్లు తినడం వల్ల వర్షాకాలంలో వచ్చే అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చంటున్నారు హెల్త్ ఎక్స్ పర్ట్స్. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు.. సీజన్ వ్యాధులతో పోరాడేందుకు సాయపడతాయి. అందుకు ఉపయోగపడేవి ఏంటంటే..

పీచ్: పీచ్ పండ్లలో ఫ్లోరెడ్ ఎక్కువగా ఉంటుంది. ఇది నోటి ఆరాగ్యానికి పనిచేస్తుంది. పీచ్ ను పచ్చిగా తిన్నా లేదా సలాడ్ తో కలిపి తీసుకున్నా ఇందులోని హెల్త్ బెనిఫిట్స్ ఎక్కడికీ పోవు. ఇందులోని విటమిన్స్, ఫొటాషియం, ఫోలేట్, ఐరన్ రోగనిరోదక శక్తిని పెంచుతుంది.

లిట్చీ: లిట్చీలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇవి ముఖ్యంగా అస్తమా రోగుల శ్వాసక్రియను మెరుగుపరుస్తుంది. బరువు తగ్గుతారు. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులోని విటమిన్ సీ.. జలుబు లాంటి ఇన్ఫెక్షన్స్ ను పోగొట్టేందుకు పనిచేస్తుంది.

ఆల్బుకారా: ఆల్బుకారా పండ్లలోని ఎరుపు నీలం ఆంథోసైనిన్ వర్ణద్రవ్యం క్యాన్సర్ కు వ్యతిరేకంగా పోరాడుతుంది. వర్షాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్, నీటి ద్వారా వచ్చే ఎలర్జీలను పోగొడుతుంది.

చెర్రీస్: చెర్రీస్ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీర కణాలకు ఫ్రీ రాడికల్స్ రాకుండా ఆపుతుంది. క్యాన్సర్ కు వ్యతిరేకంగా పోరాడుతుంది. అంతేకాకుండా ఆర్థరైటిస్ నొప్పిని తగ్గించేందుకు సాయపడతాయి.

అల్ల నేరెడు: అల్ల నేరెడు పండ్లలో కేలరీలు తక్కువగా ఉంటాయి. విటమిన్స్, ఐరన్, ఫోలేట్, పొటాషియంలతో పాటు ఇతర ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఈ కాలంలో అల్ల నేరేడు పండ్లను తినడం మంచిది.

Eating these fruits during monsoons boosts immunity

rainy season diseases, latest news, telugu news, seasonal diseases, fruits to ear monsoon, fruits that increase immunity

Tags:    

Similar News