TEA : చలికాలంలో ఎక్కువగా టీ తాగుతున్నారా? అయితే ఈ ఇబ్బందులు తప్పవు

Byline :  saichand
Update: 2024-01-09 16:20 GMT

చాలా మంది చలి కాలంలో వెచ్చదనం కోసం ఎక్కువగా టీ తాగుతుంటారు. అయితే, చలికాలంలో ఎక్కువగా టీ తాగడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎక్కువగా టీ తాగడం వల్ల అనేక సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని అంటున్నారు. అల్లంతో ;పాటు ఇతర సుగంధాలతో తయారు చేసిన టీ తాగడం వల్ల వివిధ వ్యాధుల నుండి ఉపశమనం కలుగుతుంది. జలుబు, దగ్గు నుండి ఉపశమనం పొందడమే కాకుండా, తరచుగా మూత్ర విసర్జన సమస్య నుండి కూడా చాలా వరకు ఉపశమనం లభిస్తుంది. అయితే అల్లం టీ ఎక్కువగా తాగకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. టీలో అల్లం, లవంగాలు, యాలకులు వేసి ఎక్కువ సేపు మరగబెట్టడం వల్ల అందులో ఉండే టానిన్లు బయటకు వస్తాయని, ఇది ఎసిడిటీని కలిగిస్తుందని అంటున్నారు.

టానిన్ అంటే ఏమిటి?

టానిన్ అనేది ఒక రకమైన యాంటీ ఆక్సిడెంట్, ఇది టీ ఆకులలో కనిపిస్తుంది. టానిన్లు ఎక్కువగా తీసుకున్నప్పుడు, యాసిడ్ రిఫ్లక్స్ , గ్యాస్ ఏర్పడుతుంది. టీ తాగిన తర్వాత గ్యాస్ ఎక్కువసేపు ఉంటే, కడుపులో వాపు సమస్య మొదలవుతుంది. కాబట్టి పేగుల సంబంధిత సమస్యలు ఉన్నవారు టీని వీలైనంత తక్కువగా తాగాలి. స్టొమక్ ఇన్ఫెక్షన్ల తో బాధపడేవారు కూడా టీ పూర్తిగా మానేయాలి.

ఒక రోజులో ఎంత టీ తాగాలి?

నిపుణుల అభిప్రాయం ప్రకారం, టీ రోజుకు రెండు మూడు సార్లు మాత్రమే త్రాగాలి. దీని కంటే ఎక్కువ టీ హానికరం. చలికాలంలో కూడా టీని రోజుకు రెండు మూడు సార్లు తాగితేనే మంచిదని భావిస్తారు, లేకుంటే అది హాని కలిగిస్తుందని వెల్లడించారు.

Tags:    

Similar News