భారతదేశంలో తయారు చేసి మరో ఔషధంపై WHO హెచ్చరికలు జారీ చేసింది. ఇరాక్ లో విక్రయించబడుతున్న భారత్ కోల్డ్ ఔట్ అనే దగ్గు టానిక్‌లో విషతుల్యపదార్థాలు ఉన్నట్లు డబ్ల్యూహెచ్ఓ తేల్చింది. కోల్డ్ ఔట్ టానిక్ వాడకం సురక్షితం కాదని తెలిపింది. ప్రధానంగా పిల్లలు ఉపయోగిస్తే తీవ్ర అనారోగ్యం గురవుతారని, మరణించే అవకాశం కూడా ఉందని హెచ్చరికలు జారీ చేసింది. గత 10 నెలల్లో ఒక భారతీయ ప్రొడెక్ట్ పై ఇలా హెచ్చరిక జారీ చేయడం ఇది ఐదవసారి.
చెన్నైకు చెందిన ఫోర్ట్స్ లేబోరేటరీస్ ఇరాక్ లోని డాబిలైఫ్ ఫార్మా కోసం కోల్డ్ ఔట్ దగ్గు మందును తయారుచేసింది. ఈ దగ్గు ముందులో పరిమితికి మించి డౌథిలీన్, ఇథీలన్ గ్లైకాల్ లు ఉన్నట్లు WHO తెలిపింది. సిరప్ బ్యాచ్‌లో 0.25% డైథైలీన్ గ్లైకాల్ మరియు 2.1% ఇథిలీన్ గ్లైకాల్ ఉన్నాయి. వాటి పరిమితి 10% మించి ఉండకూడదు. దీని ప్రభావంతో కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు, మూత్ర విసర్జన చేయలేకపోవడం, తలనొప్పి, మానసిక స్థితి మారడం, మూత్రపిండాలపై ఎఫెక్ట్ పడి మరణానికి దారితీసే అవకాశం ఉన్నట్లు WHO తెలిపింది.
ఇరాక్‌లో నిర్వహించిన టెస్ట్ లో సిరప్ విఫలం చెందడంతో మార్కెట్ నుంచి ఉత్పుత్తులను జప్తు చేస్తున్నట్లు భారత ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించింది. గత సంవత్సరం భారతదేశంలోని మైడెన్ ఫార్మాస్యూటికల్స్ తయారు చేసిన దగ్గు సిరప్‌లు..గాంబియా,ఉజ్బెకిస్తాన్‌లలో కనీసం 89 మంది పిల్లల మరణానికి కారణమయ్యాయి.అప్పటి నుంచి ముందగానే పరీక్షలు నిర్వహిస్తున్నారు.