Winter Precautions : చలికాలంలో ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే..వెరీ డేంజర్

Byline :  Aruna
Update: 2023-12-05 07:22 GMT

చలి తీవ్రత రోజు రోజుకు అధికమవుతోంది. గత రెండు మూడు రోజుల నుంచి పగటి ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. తెల్లవారుజామున పొగమంచు బాగా కురుస్తుంది. చలిగాలులు విపరీతంగా వీస్తుండడంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. అయితే ఇంతటి చలిలోనూ కొంతమంది ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం పొద్దున్నే వాకింగ్, జాగింగ్ అంటూ బయటికి వస్తుంటారు. అయితే చలికాలంలో జాగ్రత్తలు పాటించకపోతే ఆనారోగ్యం పాలవుతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్య సూత్రాలు పాటించకపోతే వ్యాధుల బారినపడటం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా ఇమ్యూనిటి పవర్ తక్కువగా ఉన్న వారు తొందరగా జబ్బుల బారిన పడుతుంటారు. కాబట్టి ఈ చలికాలంలో సరైన పౌష్టికాహారం తీసుకోవాలని సూచిస్తున్నారు.

వృద్ధులు, చిన్నారులు బయటకు రావొద్దు :

చలికాలంలో చల్లని వాతావరణం ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. చుట్టుపక్కన ప్రాంతాలు ఆహ్లదకరంగా ఉన్నప్పటికీ ఈ చలికాలంలో ఆహ్లదంతో పాటు జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా గర్భిణులు, బాలింతలు,వృద్ధులు, చిన్నారులు ఈ సీజన్‎లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్స్ సూచిస్తున్నారు. రోజు రోజుకు ముదురుతున్న చలి తీవ్రతతో శ్వాసకోశ సంబంధించిన వ్యాధులు అధికంగా వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ వణికించే చలిలో వృద్ధులు, చిన్నారులు అసలు బయటకు రాకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. అవసరమైతేనే బయటకు రావాలని..ఒకవేళ వస్తే ముఖానికి మంకీ క్యాపులు, మాస్కులు ధరించడం తప్పనిసరి అని చెబుతున్నారు.

పరిసరాల శుభ్రత తప్పనిసరి :

ఈ సీజన్‎లో శుభ్రతపైన దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వ్యక్తిగత శుభ్రత ఎంత ముఖ్యమో పరిసరాల శుభ్రత కూడా అంతే ముఖ్యం. పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటే దోమలు వ్యాప్తిచెందే అవకాశం ఉంది. దోమల సంఖ్య పెరిగితే టైఫాయిడ్, డెంగ్యూ, చికెన్ గున్యా, మొదడువాపు, జ్వరాల బారిన పడే ప్రమాదం ఉంది. ముఖ్యంగా తాగే నీటి విషయంలో తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కలుషితమైన నీరు తాగటం వల్ల డయేరియా వచ్చే డేంజర్ ఉందంటున్నారు నిపుణులు. ఈ సీజన్‎లో వీచే చల్లటిగాలుల ద్వారా స్వైన్ ప్లూ వంటి ప్రమాదకరమైన వ్యాధులు సోకే ఛాన్స్ ఉంది. ఇమ్యూనిటి పవర్ తక్కువగా ఉన్నవారు ఎక్కువగా జబ్బుల బారినపడే అవకాశం. కాబట్టి రోగనిరోధక శక్తిని పెంచే ఫుడ్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

శ్వాసకోస వ్యాధులు వచ్చే ప్రమాదం :

చిన్నారులు, వృద్ధులు, అస్తమా పేషెంట్స్ చల్లటిగాలిలో మంచు పట్టిన సమయంలో బయటికి రావడం మంచిది కాదు. చలికాలంలో ముఖ్యంగా ఏసీలు, ఫ్యాన్లు, కూలర్లు వాడకూడదు. అదే విధంగా స్కిన్‎పై అశ్రద్ద వహించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. దగ్గు, జలుబు వంటి సమస్యలు ఎక్కువైనప్పుడు గొంతులో కఫం ఏర్పడుతుంది. ఇలా ఏర్పడినటువంటి కఫాన్ని చాలామంది మింగేస్తుంటారు. ఇలా చేయడం వల్ల దగ్గు జలుబు సమస్యలు మాత్రమే కాదు ఊపిరితిత్తులు కూడా ఇన్ఫెక్ట్ అవుతాయి. ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ కి గురైతే శ్వాసకోస సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. కఫాన్ని ఎప్పటికప్పుడు ఉమ్మటం వల్ల జలుబు దగ్గు సమస్య తొలగిపోతుంది. తలబారం కూడా తగ్గుతుంది. చలికాలంలో వచ్చే దగ్గు జలుబు ఇన్ఫెక్షన్‎ని తగ్గించుకోవడానికి రోజులో మూడు సార్లు గ్రీన్ టీ తాగాలి. గ్రీన్ టీ బ్యాక్టీరియా కఫం వంటి వాటిని పూర్తిగా నశింప చేస్తుంది. ఇలా రోజూ వేడివేడిగా మూడుసార్లు గ్రీన్ టీ తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. 




Tags:    

Similar News