Japanese Water Therapy : జపనీయుల ఆరోగ్య రహస్యం ఇదే ..కేవలం నీళ్లతోనే...

Byline :  Aruna
Update: 2023-12-22 07:03 GMT

ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చితే జపాన్‌ ప్రజల ఆయువు చాలా గట్టిది. ఈ దేశంలో మరణాల రేటు తక్కువ అని తాజా గణాంకాలు సైతం చెబుతున్నాయి. జపనీయులు వారి పూర్వికులు అనుసరించిన సంప్రదాయ పద్ధతులనే ఇప్పటికీ ఫాలో అవుతూ వస్తున్నారు. ఈ పద్ధతులే వారిని ఆరోగ్యంగా, ఎక్కువ కాలం జీవించేలా చేస్తున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. మరీ ముఖ్యంగా జపాన్ ప్రజలు ఆరోగ్యంగా ఉండటానికి నీరే ప్రధాన కారణమట. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా జపనీయుల ఆరోగ్య రహస్యం నీరే. జపనీయులు అనుసరిస్తున్న నీటి శుద్ధి పద్ధతులు వారి శరీరాన్ని హెల్దీ‎గా ఉంచడంలో సహాయపడుతున్నాయి. అయితే నిజానికి ప్రతి రోజూ ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో ఒక గ్లాసు నీళ్లు తాగాలని వైద్యులు సూచిస్తుంటారు. ఈ అలవాటు చాలా మంచిదని అంటుంటారు. అందుకే మనం కూడా ప్రతి రోజూ ఉదయం నీటిని తాగడం అలవాటు చేసుకున్నాము. ఈ పద్ధతి ఇప్పటిది కాదు కొన్నేళ్లుగా మన పూర్వికులు అనుసరిస్తున్నదే. అయితే దీని మూలం మాత్రం జపాన్ నుంచి వచ్చిందంటున్నారు నిపుణులు.

ప్రతి రోజూ ఉదయం నిద్రలేవగానే జపనీయులు పరగడుపునే నాలుగు నుంచి ఆరు గ్లాసుల నీళ్లు తాగుతారు. అయితే ఆ నీటిని తొందరపడకుండా నిదానంగా తాగుతారు. అలా నిదానంగా నీరు తాగితేనే అది మన శరీరంలో సక్రమంగా పనిచేస్తుందట. అంతే కాదు శరీరంలో వాటర్ బ్యాలెన్స్ కూడా మెయిన్‎టైన్ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. మొదట నీళ్లు తాగిన తర్వాతే పళ్ళు తోముకుంటారు. ఇలా ప్రతి రోజూ క్రమం తప్పకుండా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు. నీరు త్రాగిన తర్వాత, ఏదైనా ఆహారం లేదా డ్రింక్ తీసుకుంటారు. అయితే తప్పనిసరిగా నీరు తాగాక 45 నిమిషాల గ్యాప్ తీసుకుంటారు. ఆ తర్వాతే ఏదైనా తింటారు లేదా తాగుతారు. ఇలా చేయడం వల్ల మన బాడీ పోషకాలను మరింత సమర్థవంతంగా తీసుకునేలా తయారవుతుందట. ఇక భోజన సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. తినే ఏ ఆహారమైనా బాగా నమిలి తింటారు. తినేటప్పుడు నీరు అస్సలు తాగనేతాగరు.ఇలా తినేప్పుడు నీరు ఎక్కువగా తాగితే ఒంటికి అంత మంచిది కాదంటారు జపనీయులు. ఎందుకంటే ఇది జీర్ణక్రియపై ఒత్తిడి తెస్తుందట.

ఖాళీ కడుపుతో నీరు త్రాగడం వల్ల జీర్ణక్రియకు మేలు చేస్తుంది. తినే ఆహారాన్ని జీర్ణం చేయడానికి అవసరమైన ఎంజైమ్‌లు నీటి ద్వారానే లభిస్తాయి. నీరు ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది కాబట్టి, జీర్ణవ్యవస్థ ద్వారా జీర్ణక్రియ కూడా చాలా సులభంగా అవుతుంది. ఆహారం తినే ముందు ఎక్కువ నీళ్లు తాగితే, ఆహారం సరిపడా తినలేరు. కొంచెం తిన్నా..కడుపు నిండిన ఫీల్ ఉంటుంది. ఫలితంగా బరువు పెరిగే అవకాశం ఉండదు. అంతేకాకుండా కడుపు చాలా కాలం పాటు నిండినట్లు అనిపిస్తుంది. ఇదే విధానం జపనీయుల ఆరోగ్య రహస్యం. మరీ మీరూ ఈ పద్ధతులు పాలో అయ్యి ఆరోగ్యంగా ఉండండి.

Full View



Tags:    

Similar News