ప్రస్తుతం ఎక్కువ మంది ఫాలో అవుతున్న డైట్లు రెండు. ఒ్టి ఇంటర్మిటన్ ఫాస్టింగ్ అయితే రెండోది కీటో డైట్. ఇందులో కీటో డైట్ వల్ల ఫలితాలు తొందరగా కనిపిస్తాయి. కానీ దీని వల్ల గుండె సమస్యలు వస్తున్నాయని చెబుతున్నారు డాక్టర్లు. లాభాల మాట పక్కన పెట్టండి బతకడం చాలా ఇంపార్టెంట్ కదా అంటున్నారు.
కొన్ని రోజులుగా హార్ట్ ఎటాక్ లు చాలా పెరిగిపోయాయి. ఉన్నట్టుండి మనుషులు కుప్పకూలిపోతున్నారు. దీనికి చాలా కారణాలున్నాయి. కోవిడ్ వల్ల కొంతమంది, డైట్ వల్ల కొంతమంది, మారిన జీవన శైలి వలన మరికొంత చనిపోతున్నారు. మిగతా కారణాలు ఎలా ఉన్నా డైట్ వలన అందులోనూ కీటో వల్ల మాత్రం చాలా ప్రమాదం ఉందని చెబుతున్నారు నిపుణులు.
కీటో డైట్ బరువు చాలా తగ్గిస్తుంది, అందులో సందేహమే లేదు. కానీ దీని వలన రక్తపోటు తగ్గడం, కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గడం, బ్లడ్ లో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. వాటితో పాటూ ట్రైగ్తిజరైడ్ స్థాయిలు కూడా తగ్గుతాయని చెబుతున్నారు డాక్టర్లు. ఇవి గుండె ఆరోగ్యాన్ని పాడు చేస్తాయని చెబుతున్నారు. ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉంటే హార్ట్ ఎటాక్ లు వస్తాయని అంటున్నారు.
ఇక కీటో డైట్ వల్ల మరో ప్రమాదం కూడా ఉంది. ఈ డైట్ వలన మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గి...చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతున్నాయి. ిది మన శరీరానికి ఎంతమాత్రమూ మంచిది కాదు. దీనివలన గుండె జబ్బులు తొందరగా వస్తాయి. వీటితో పాటూ పోషకాహారం సరిగ్గా బాడీకి అందదు కీటో వలన. కీటో లో చాలా పళ్ళు, కూరలు, తృణధాన్యాలను తినకూడదు. చాలా పదార్ధాలు తీసుకోకూడదు. దీనివల్ల రిచ్ కార్బోహైడ్రేట్ ఫుడ్ బాడీకి అందదు. దీంతో గుండెకు మంచివి అయిన ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు, లవణాలు, ఫైబర్ లాంటివి అందవు. ఇది కూడా హార్ట్ ఎటాక్ లకు దారి తీస్తుంది. కాబట్టి ఏ డైట్ తీసుకుంటున్నా నిపుణుల పర్యవేక్షణలో చేయండి అంటున్నారు. ఏదీ అతిగా చేయడం కూడా మంచిది కాదని చెబుతున్నారు.