ఉమ్మితో ప్రెగ్నెన్సీ టెస్ట్..5 నిమిషాల్లో రిజల్ట్

Update: 2023-06-20 10:16 GMT

మారుతున్నకాలానికి అనుగుణంగా వైద్య రంగంలోనూ అనేక మార్పులు వస్తున్నాయి. అత్యాధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుని అనేక వినూత్నమైన, విప్లవాత్మకమైన ప్రయోగాలకు శాస్త్రవేత్తలు శ్రీకారం చుడుతున్నారు. సమాన్యులు సైతం సులువుగా వైద్య సేవలను వినియోగించుకోవాలనే ఉద్దేశంతో సరికొత్త టెస్టింగ్ టూల్స్‎ను యూజర్ ఫ్రెండ్లీగా లాంచ్ చేస్తున్నారు. తాజాగా గర్భనిర్ధారణ కోసం సరికొత్త కిట్లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటి వరకు ప్రెగ్నెన్సీ కర్ఫర్మేషన్ కోసం డాక్టర్లు యూరిన్ టెస్ట్ చేయించుకుని రమ్మనేవారు లేదా మహిళలు యూరిన్ బేస్డ్ కిట్స్‎ను వాడేవారు. కానీ ఇకపై ఆ ఇబ్బంది ఏమీ లేకుండా ఉమ్మితోనే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకునే హోంటెస్ట్ కిట్‌లు అందుబాటులోకి వచ్చేశాయి. త్వరలోనే వరల్డ్ వైడ్‎గా ఈ టెస్టింగ్ కిట్స్ వినియోగంలోకి రానున్నాయి.

ఉమ్మితో గర్భనిర్ధారణ పరీక్షలు చేసుకునే సాలిస్టిక్ కిట్లను జరూసలెంకు చెందిన సాలిగ్నోస్టిక్స్ అనే బయోటెక్ స్టార్టప్ కంపెనీ రూపొందింది. ఈ కిట్ల రూపకల్పనకు సంస్థ ఏడాది పాటు శ్రమించింది. కరోనా టెస్టింగ్ కిట్స్‎కు వినియోగించిన సాంకేతికత ఆధారంగా వీటిని రూపొందించడం గమనార్హం. తాజాగా యూకే ప్రజలకు ఈ కిట్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఐర్లాండ్‎లోనూ ఈ గర్భ నిర్ధారణ కిట్ల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. యూఎస్‎లోనూ విక్రయాలు చేపట్టేందుకు సంస్థ అనుమతి కోసం ఇప్పటికే ఎఫ్‎డీఏకు అప్లై చేసింది.

సాలిస్టిక్ కిట్లను ఎంతో సులువుగా వినియోగించుకోవచ్చు. వీటిని ఎప్పుడైనా..ఎక్కడైనా వాడొచ్చు. జ్వరం వస్తే టెంపరేచర్ ను థెర్మామీటర్‌తో చెక్ చేసుకున్నట్లే ఈ కిట్‌లో వచ్చే స్టిక్‌ను నోట్లో అలా 5 నిమిషాలు పెట్టుకుంటే చాలు రిజల్ట్ వచ్చేస్తుంది. కొన్నిసార్లు మూడు నిమిషాల్లోనే ఫలితం వచ్చేస్తుంది.

Tags:    

Similar News