చిన్న విషయానికే కోపం వస్తోందా? అయితే మీ గుండె జాగ్రత్త

Byline :  Aruna
Update: 2023-12-27 06:34 GMT

తన కోపమే తనకు పెద్ద శత్రువు అని పెద్దలు ఎప్పుడో చెప్పారు. నిజమే క్షణికావేషంలో ఏం చేస్తున్నామో అన్న విచక్షణ కూడా ఉండదు. ఎవరైనా సరే కోపం రాగానే వెంటనే పక్కన ఉన్న వ్యక్తి మీద మన కోపాన్ని మాటల ద్వారా ప్రదర్శిస్తుంటారు.మరికొంత మంది వస్తువులను విసిరేస్తారు. కోపంలో కంట్రోల్ తప్పి మనం మాట్లాడే ప్రతి మాట మన ఎదుట వ్యక్తిని తీవ్రంగా బాధిస్తాయి. వాస్తవానికి సంతోషం, బాధలాగా.. కోపం కూడా ఒక ఫీలింగే. అందరికీ కోపం రావడం సర్వసాధారణమైన విషయమే. ఎంతో కూల్‌గా ఉండే వ్యక్తి కి కూడా ఏదో ఒక సందర్భంలో కోపం వస్తుంది. అయితే కొంతమందిలో కోపం మరీ మితిమీరిపోతోంది. ఎంత ట్రై చేసినా దాన్ని కంట్రోల్‌ చేసుకోలేకపోతారు. ఈ కోపం కారణంగా ఎక్కుడున్నారు, ఎవరితో,ఏం చేస్తున్నారు అనే విషయాన్నీ మర్చిపోతారు. నిజానికి ఈ కోపము ఓ రోగమే. కోపం మనుషుల మధ్య దూరాన్నే కాదు ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకూ దారి తీస్తుంది. తరచుగా కోప్పడే వారిలో హెడ్ ఏక్, హైపర్‌టెన్షన్‌, హెవీ బ్రీతింగ్ వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కూల్ పర్సన్స్ తో పోల్చితే కోపిష్టుల్లో ఆందోళన, ఒత్తిడి అధికం. కొపం కారణంగా ఎన్నో మెంటల్ టెన్షన్స్ ఎదురయ్యే ప్రమాదం కూడా ఉంది. ఊరికే కోపంతో ఊగిపోవారికి "మోనోమైన్ ఆక్సిడేస్ ఎ" అనే ఎంజైమ్ కూడా ఓ కారణమని పరిశోధనలో బయటపడింది. ఈ ఎంజైమ్ ఒక్కో వ్యక్తిలో ఒక్కోలా ఉంటుంది. అయితే ఈ ఎంజైమ్ తక్కువగా ఉన్నవారిలో కోపం ఎక్కువగా ఉంటుందని నిపుణుల అభిప్రాయం. మరి చిన్నపాటి చిట్కాలు ఫాలో అయితే యాంగర్ మేనేజ్మెంట్ చేయవచ్చు.

ఎవరైనా సరే ఫస్టఫాల్ అసలు కోపం ఎందుకు వస్తుందో గుర్తించాలి. ఈ విషయం గురించి సన్నిహితులతో డిస్కస్ చేయాలి. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, పర్సనల్ డాక్టర్ , స్కూల్ టీచర్ ఇలా ఎవరితోనైనా సరే షేర్‌ చేసుకోవాలి. వారు ఇచ్చే సలహాలు సూచనలు తీసుకోవాలి. ఇలా చేడయం వల్ల కోపం తెప్పించే.. పరిస్థితులను ఎలా అధిగమించాలో ఓ అవగాహన ఏర్పడుతుంది. దీంతో ఈజీగా యాంగర్‏ను కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు. ఓ నివేదిక ప్రకారం, డీప్‌ బ్రీత్‌ తీసుకోవడం వల్ల శరీరం రిలాక్స్‌ అవుతుంది. హ్యాపీ ఫీల్ కలగడంతో పాటు ఆలెర్ట్‌ అవుతారు. ఎక్సైట్‌మెంట్‌ తగ్గి ,ఆందోళన, నిరాశ, కోపం, గందరగోళం వంటి ఫీలింగ్స్ దూరమవుతాయి. అందుకే కోపం ఎప్పుడు వచ్చినా డీప్ బ్రీత్‌ తీసుకోవడానికి ట్రై చేయండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విషయం నుంచి మీ మైండ్‎ను డైవర్ట్ చేయండి. ఇలా చేస్తే కూడా కోపం తగ్గి కూల్‌ అవుతారు. డైయిలీ వాకింగ్‌ చేయడం వల్ల శరీరానికే కాదు మానసిక ఆరోగ్యానికీ మంచిదే. కోపం తగ్గించడంలో వాకింగ్ బాగా హెల్ప్‌ చేస్తుంది. వాక్ చేయడం వల్ల మజిల్స్ రిలాక్స్‌ అవుతాయి. మైండ్ పీస్ గా ఉంటుంది. మరీ ముఖ్యంగా యాంగర్ కంట్రోల్‌ గురించి ఆలోచించడానికి సమయాన్ని ఇస్తుంది. కాబట్టి డైయిలీ ఓ అరగంట వాక్ చేయండి.

మ్యూజిక్‌‌ వింటే ఎవరికైనా మనసు ప్రశాంతంగా ఉంటుంది. చాలా వరకు అధ్యయనాలు కూడా ఇదే విషయాన్ని చెప్పాయి. మెలోడీ సాంగ్స్ మనసిక ప్రశాంతతను అందిస్తాయి. కోపం, మెంటల్ టెన్షన్స్ ఉన్నప్పుడు మూజిక్‌ వినడం అలవాటు చేసుకోండి. ఎప్పుడూ ఆఫీస్ వర్క్, ఇళ్లు, పని అని ఆలోచించకుండా రోజులో కాస్త సమయాన్నైనా మీకోసం మీరు కేటాయించుకోవడం చాలా ముఖ్యం. రోజులో కొంత సమయాన్ని మీకోసం గడపండి. ఇది ఎంతో రిలాక్సేషన్ ను అందిస్తుంది. సరైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయం చేస్తుంది. ఒంటరిగా ఉన్నప్పుడు మీ ఫీలింగ్స్‌తో పక్కవారి భావాలను మీరు అర్థం చేసుకోగలుగుతారు. ఎరైనా మీకు కోపం తెప్పిస్తే.. వెంటనే రియాక్ట్‌ అవ్వకండి , ముందు కాసేపు ఒంటరిగా గడపండి. ఎప్పుడూ మీకు సంతోషాన్నిచ్చే పనులు మాత్రమే చేయండి. సాధ్యమైతే అప్పుడప్పుడు మంచి మ్యూజిక్ పెట్టుకుని డ్యాన్స్ చేయండి. మంచి పుస్తకాలు చదవండి, పెయింటింగ్ వంటి చిన్న చిన్న పనులతో మనసు ప్రశాంతంగా ఉంటుంది. యోగా, ధ్యానం, వ్యాయామం వంటివి కూడా చేస్తూ ఉంటే కోపాన్ని కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. ఒకవేళ కోపం కనుక కంట్రోల్ లోకి రాకపోతే వెరీ డేంజర్ అంటున్నారు వైద్యులు. బీపి, లేదా గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందంటున్నారు. కాబట్టి మీ కోపాన్ని తగ్గించుకోడం మీ చేతుల్లోనే ఉంది. ఈ విషయంలో ఎలాంటి డౌట్ ఉన్నా వైద్యున్ని సంప్రదించి సరైన నిర్ణయం తీసుకోండి. 

Full View

Tags:    

Similar News