health Tips : మీ నాలుకపై ఇలాంటి మార్పులు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త!

Byline :  saichand
Update: 2024-01-10 13:29 GMT

Kidney Health : మన శరీరంలో కిడ్నీ చాలా ముఖ్యమైన భాగం. మూత్రపిండాలు శరీరంలోని వ్యర్థాలను తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి కిడ్నీలపై ఎలాంటి దుష్ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కిడ్నీలో ఏదైనా సమస్య తలెత్తితే శరీరంలో వ్యర్థాలను సరిగ్గా ఫిల్టర్ చేయదు.

మూత్రపిండాలలో సమస్యలు ఏర్పడినప్పుడు శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా నాలుకపై ఎర్పడే కొన్ని మార్పులు కీడ్ని సమస్యలకు సూచనగా పరిగణించాలి.

నాలుకపై లక్షణాలు ఏమిటి?

కిడ్నీలో ఏదైనా లోపం ఏర్పడినప్పుడు, లాలాజల గ్రంథి ప్రభావితమవుతుంది. దీంతో నోరు పొడిబారుతుంది. అటువంటి లక్షణాలు కనిపిస్తాయి.

నాలుకపై తెల్లటి మచ్చలు కనిపిస్తే, నిర్లక్ష్యం చేయవద్దు. ఇది మూత్రపిండాల సమస్యను సూచిస్తుంది.

కిడ్నీ సమస్యలలో నాలుకపై లోహపు రుచి కనిపిస్తుంది. ఈ రుచిని అనుభవిస్తే, వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఇది కాకుండా, నాలుక నుండి రక్తస్రావం లేదా నొప్పి ఎక్కువగా ఉంటుంది. కిడ్నీ ఇన్ఫెక్షన్ల అటువంటి లక్షణాలను కలిగిస్తుంది.

కొన్ని ఇతర లక్షణాలు

మూత్రపిండాల పనితీరులో అడ్డంకులు మన నిద్రను నేరుగా ప్రభావితం చేస్తాయి. అలాంటి వారికి నిద్రలేమి సమస్య వస్తుంది.

కిడ్నీ సమస్యల వల్ల టాక్సిన్స్ తొలగించబడనప్పుడు, రక్తంలో మలినాలను చేరడం ప్రారంభిస్తుంది. దీంతో చర్మంపై దురద కలుగుతుంది.

కిడ్నీలు దెబ్బతిన్నప్పుడు ఎక్కువ ప్రొటీన్లు బయటకు వెళ్లిపోతాయి. దీనివల్ల మూత్రం పసుపు లేదా గోధుమ రంగులోకి మారుతుంది. చాలా సార్లు మూత్రం నురుగు మొదలవుతుంది.

మూత్రపిండాలు మన శరీరం నుండి సోడియంను తొలగించలేనప్పుడు, అది శరీరంలో పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. దీని వల్ల కాళ్లు, ముఖం వాచిపోతాయి.

కిడ్నీ వైఫల్యం కాలు, కండరాల తిమ్మిరికి కారణమవుతుంది. సోడియం, కాల్షియం, పొటాషియం లేదా ఇతర ఎలక్ట్రోలైట్స్ స్థాయిలలో అసమతుల్యత ఉన్నప్పుడు ఈ సమస్య వస్తుంది

Tags:    

Similar News