రూ.25కే జాతీయ జెండా..ఎక్కడ..ఎలా కొనాలంటే..

Update: 2023-08-07 12:10 GMT

స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలకు భారత్ ముస్తాబవుతోంది. మువ్వన్నెల జెండాను ఎగురవేసేందుకు ప్రతి భారతీయుడు సిద్ధమవుతున్నాడు. ఈ ఏడు భారత్ స్వాతంత్ర్య దేశంగా 75 ఏళ్లు పూర్తి చేసుకుని 76వ ఏట అడుగుపెడుతోంది. ఈ 76వ పంద్రాగస్టు పండుగ సంబరాలను ఘనంగా నిర్వహించేందుకు కేంద్ర సర్కార్ సన్నాహాలు చేస్తోంది. సాధారణంగా స్వాతంత్ర్య దినోత్సవం అనగానే ప్రతి గల్లీలో త్రివర్ణ పతాకాలు రెపరెపలాడతాయి. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు దేశభక్తిని చాటుకునేందుకు తమ హృదయాలపై జాతీయ జెండాలను ధరిస్తుంటారు.




 


ఇలా దేశమంతా మువ్వన్నెల జెండాతో మురిసిపోనుంది. ఈ క్రమంలో ఈ ఏడు జరిగే వేడుకలను మరింత్ర స్పెషల్‎గా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

దేశ పౌరులకు జాతీయ జెండాలను అందించాలనే ఉద్దేశంతో హర్ ఘర్ తిరంగా 2.0పేరిట ఓ వినూత్నమైన కార్యక్రమానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ప్రతి పోస్టాఫీసులో జాతీయ జెండాలను విక్రయించాలని నిర్ణయం తీసుకుంది. అది కూడా రూ.25కే జాతీయ జెండాను విక్రయిస్తున్నట్లు సర్కార్ ప్రకటించింది. దేశ ప్రజలు తమ ఇంట్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలనే ఉద్దేశంతో ఈ ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ క్రమంలో పోస్టల్ డిపార్ట్‎మెంట్..వెబ్ పోర్టల్ ద్వారా నేషనల్ ఫ్లాగ్స్‎ను ఆన్‌లైన్‌లో విక్రయించనున్నట్లు అనౌన్స్ చేసింది.




 


ఆల్-ఇండియా రేడియో అఫీషియల్ ట్వీట్ ప్రకారం..మొత్తం లక్షా 60 వేల పోస్ట్ ఆఫీసులలో జాతీయ జెండాలను కేంద్ర విక్రయిస్తోంది. ఆగస్టు 13వ తారీఖు నుంచి 15 వరకు ప్రభుత్వం ఇంటింటికి వెళ్లి త్రివర్ణ పతాక ప్రచారాన్ని చేపడుతుంది. జాతీయ జెండాలు కావాలనేకునేవారు డిపార్ట్‌మెంట్ ఇ -పోస్టాఫీసు ద్వారా కూడా ఆన్‏లైన్‎లో కొనుగోలు చేయవచ్చు.

ఆన్‌లైన్‌లో జెండాను ఎలా కొనాలంటే? :

పోస్టాఫీసు అఫీషియల్ వెబ్‌సైట్‌‎లో.. హర్‌ గర్‌ తిరంగ ఆప్షన్‎పై క్లిక్‌ చేసి లాగిన్‌ అవ్వాలి. అనంతరం ప్రొడక్ట్‌లు కింద జాతీయ పతాకం పై క్లిక్ చేయాలి. తర్వాత కొనుగోలుపై క్లిక్‌ చేసి ఫోన్ నంబర్‌ను రిజిస్టర్ చేయాలి. వెంటనే ఫోన్‎కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి. ప్రొసీడ్ ఫర్ పేమెంట్‎ను సెలెక్ట్ చేయాలి. రూ.25 చెల్లించాలి. అంతే మీరు ఇచ్చిన అడ్రస్‎కు జెండా డెలివరీ అవుతుంది.

జాతీయ జెండాను పోస్ట్ ఆఫీస్‎లో ఆఫ్‌లైన్‌లోనూ కొనుగోలు చేయవచ్చు. 




 




Tags:    

Similar News