కూలిన రష్యా సైనిక విమానం.. 74 మంది మృతి!

Byline :  Vijay Kumar
Update: 2024-01-24 12:36 GMT

రష్యాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. రష్యా-ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో రష్యాకు చెందిన సైనిక విమానం కుప్పకూలింది. రష్యా సైనిక విమానం ఉక్రెయిన్‌ సమీపంలోని బెల్గోరోడ్‌ ప్రాంతంలో బుధవారం ఈ ఘటన జరిగిందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉదయం 11 గంటల సమయంలో ఈ విమానం కుప్పకూలిందని పేర్కొంది. ఈ ఘటనలో 74 మంది ఉక్రెయిన్‌ యుద్ధ ఖైదీలు మృతి చెందారు. ఇటీవల ఇరు దేశాల మధ్య ఖైదీల మార్పిడికి ఒప్పందం కుదిరింది. అందులో భాగంగా రష్యన్ మిలటరీ విభాగం ఉక్రెయిన్‌ ఖైదీలను బెల్గోరోడ్‌కు తరలించింది. బెల్గోరోడ్‌ రిజియన్ ఉక్రెయిన్‌ తూర్పు సరిహద్దులో ఉంటుంది. అక్కడికి సైన్యాన్ని తరలిస్తుండగా.. ఈ ప్రమాదం జరిగినట్టు రష్యా రక్షణశాఖ వెల్లడించింది.

అయితే విమాన ప్రమాదానికి కారణాలను తెలియరాలేదు. ఈ విషయమే ప్రత్యేక మిలటరీ కమిషన్‌ దర్యాప్తు చేస్తున్నట్టు రక్షణ శాఖ ప్రకటించింది. సంఘటనా స్థలంలో అత్యవసర సేవల విభాగం, దర్యాప్తు సిబ్బంది పని చేస్తున్నట్టు బెల్గోర్డో గవర్నర్‌ వ్యాచెస్లవ్‌ గ్లాడ్కోవ్‌ వెల్లడించారు. కాగా విమానం కూలిపోయిన ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

Tags:    

Similar News