40 ఏళ్ల తర్వాత క్లాస్ మేట్స్ను కలిసిన సీజేఐ చంద్రచూడ్

Byline :  Vijay Kumar
Update: 2024-02-12 14:13 GMT

40 ఏళ్ల తర్వాత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా (సీజేఐ) డీవై చంద్రచూడ్ తన క్లాస్ మేట్స్ ను కలుసుకున్నారు. సుప్రీంకోర్టు ఈ ఘటనకు సాక్ష్యంగా నిలిచింది. 1983లో జస్టిస్ చంద్రచూడ్ అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్ లా స్కూల్ లో చదువుకున్నారు. ఆ సమయంలోనే ఆయనతో పాటు ప్రస్తుతం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ జడ్జిగా ఉన్న జస్టిస్ హిల్లరీ చార్లెస్ వర్త్, అలాగే ఇండియాలో టాప్ లాయర్ గా ఉన్న పరాంగ్ త్రిపాఠి చదువుకున్నారు. సోమవారం ఢిల్లీలోని సుప్రీంకోర్టులో జరిగిన ఓ కార్యక్రమానికి వీరు హాజరయ్యారు. సుప్రీంకోర్టు ఫౌండేషన్ డే సెలబ్రేషన్ కు జస్టిస్ హిల్లరీ చీఫ్ గెస్ట్ గా హాజరు కాగా ఓ కేసు విచారణలో జరిగిన కోర్టు ప్రొసీడింగ్స్ లో ఆమెను ఆహ్వానించారు. అలాగే కోర్టు ప్రొసీడింగ్స్ లో పరాగ్ త్రిపాఠి కూడా పాల్గొన్నారు. న్యాయ విభాగంలో టాప్ పొషిషన్ లో ఉన్న ఈ చిన్ననాటి క్లాస్ మేట్స్ 40 ఏళ్ల తర్వాత తిరిగి కలుసుకుని తమ కాలేజీ రోజులను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. సొలిసిటర్ జనరల తుషార్ మెహతా హిల్లరీ చార్లెస్ వర్తకు ధన్యవాదాలు తెలిపారు. 

Tags:    

Similar News