ECIL Recruitment 2024: హైదరాబాద్ ECILలో ఉద్యోగాలు.. అప్లై చేసుకోండిలా!

Byline :  saichand
Update: 2024-01-13 08:10 GMT

ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL)లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్లో జూనియర్ టెక్నీషియన్ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్ధుల కోసం దరఖాస్తులను కోరుతుంది. రిక్రూట్మెంట్ ప్రక్రియ జనవరి 10, 2024 నుండి ప్రారంభమైంది. ఆసక్తి గల అభ్యర్థులు 16 జనవరి 2024 వరకు అధికారిక వెబ్సైట్ ecil.co.inని సందర్శించడం ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు

ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో 1100 జూనియర్ టెక్నీషియన్ పోస్టులకు కోసం ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ జరుగుతుంది.

ఎలక్ట్రానిక్స్/మెకానిక్ - 275 పోస్టులు

ఎలక్ట్రీషియన్ - 275 పోస్టులు

ఫిట్టర్ - 550 పోస్టులు

ECIL రిక్రూట్మెంట్ 2024 అర్హత ప్రమాణాలు

నోటిఫికేషన్ ప్రకారంగా ECIL రిక్రూట్మెంట్ 2024 కోసం ఎంపికైన అభ్యర్థులు కాంట్రాక్ట్ ప్రాతిపదికన 4 నెలల కాలవ్యవధికి పని చేయాల్సి ఉంటుంది, ప్రాజెక్ట్, అవసరాలు, అభ్యర్థి పనితీరు ఆధారంగా దీనిని 2 నెలలు పొడిగించవచ్చు.

అభ్యర్థి ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఎలక్ట్రీషియన్ లేదా ఫిట్టర్ ట్రేడ్లో ఒక సంవత్సరం అప్రెంటిస్ షిప్తో పాటు ITI (2 సంవత్సరాలు) ఉత్తీర్ణులై ఉండాలి. ఎలక్ట్రానిక్ కాంట్రాక్ట్ తయారీలో కనీసం ఒక సంవత్సరం అర్హత అనుభవం (ITI + అప్రెంటిస్ షిప్ ) ఉండాలి.


వయో పరిమితి

ECIL రిక్రూట్మెంట్ 2024 కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు జనవరి 16, 2024 నాటికి 30 ఏళ్లు మించకూడదు.

వేతనం

ECIL రిక్రూట్మెంట్ కోసం షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులను ఇంటర్వ్యూకి పిలుస్తారు, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ హైదరాబాద్లో జరగనుంది. ECIL రిక్రూట్మెంట్ 2024 కోసం ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 22,528 వేతనం ఇవ్వబడుతుంది.

Tags:    

Similar News