హైదరాబాద్ ECIL లో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ఎప్పుడంటే..

Update: 2023-08-08 05:42 GMT

హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌(ఈసీఐఎల్) ఒప్పంద ప్రాతిపదికన టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆగస్టు 10, 11 తేదీల్లో(గురు, శుక్రవారాల్లో) నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికేట్‌లు, సెల్ఫ్-అటెస్టెడ్ ఫోటోకాపీల సెట్‌తో పాటుగా పూర్తి చేసిన దరఖాస్తు ఫారమ్ & రెజ్యూమ్‌తో ఉదయం 09.00 గంటలకు రిపోర్ట్ చేయాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్, షార్ట్‌లిస్టెడ్, పర్సనల్ ఇంటర్వ్యూ, వెయిటేజీ ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది.

ఉద్యోగ వివరాలు...

మొత్తం ఖాళీలు: 100

పోస్టులు: టెక్నికల్‌ ఆఫీసర్లు.

విభాగాలు: మెకానికల్‌/ ఎలక్ట్రానిక్స్‌/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజినీరింగ్‌ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 60 శాతం మార్కులతో బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత.

పని అనుభవం: కనీసం 01 ఏడాది పని అనుభవం ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.25000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

ఇంటర్వ్యూ వేదిక: కార్పొరేట్ లెర్నింగ్ & డెవలప్‌మెంట్ సెంటర్, నలంద కాంప్లెక్స్, TIFR రోడ్, Electronics Corporation of India Limited, ECIL Post, Hyderabad – 500062.

ఇంటర్వ్యూ తేది: 10, 11.08.2023.

ఇంటర్వ్యూ సమయం: ఉదయం 10, 11.08.2023.

Tags:    

Similar News