గురుకుల పాఠశాలల్లో పోస్టుల భర్తీకి నిర్వహిస్తున్న ఆన్ లైన్ పరీక్షలో టెక్నికల్ ప్రాబ్లెం తలెత్తింది. సోమవారం ఉదయం 8:30 గంటలకు ప్రారంభం కావాల్సిన పీజీటీ గురుకుల ఆన్‌లైన్ పరీక్ష ఇంకా ప్రారంభం కాలేదు. ఇవాళ ఇంగ్లీష్ పరీక్ష నిర్వహించాల్సి ఉండగా.. సర్వర్ లో సమస్య తలెత్తింది. దీంతో అభ్యర్థులను ఇంకా ఎగ్జామినేషన్ సెంటర్లలోకి అనుమతించడం లేదు. సాంకేతిక సమస్య కారణంగానే పరీక్ష ఆలస్యమైనట్లు పరీక్ష కేంద్రాల నిర్వాహకులు చెబుతున్నారు. గంట దాటినా ఎగ్జామ్ ప్రారంభంకాకపోవడంతో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ గురుకులాల్లో ఖాళీగా ఉన్న 1,276 పీజీటీ ఉద్యోగాలకు ఏప్రిల్ 24న గురుకుల నియామక బోర్డు నోటిఫికేషన్‌ను జారీ చేసింది.