పవర్​గ్రిడ్​(PGCIL)లో ట్రైనీ ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి

నెలకు రూ.70 వేల జీతంతో ట్రైనీ ఉద్యోగాలు;

By :  Lenin
Update: 2023-11-26 07:20 GMT


ఐటీఐ చేసి ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ ​న్యూస్​. పవర్​గ్రిడ్​ కార్పొరేషన్​ ఆఫ్ ఇండియా లిమిటెడ్​ (PGCIL) 203 జూనియర్​ టెక్నీషియన్ ట్రైనీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 22న ప్రారంభమవగా, డిసెంబర్ 12న ముగుస్తుంది. ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో మొత్తం 203 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులపై ఉద్యోగం పొందాలని ఆసక్తి ఉన్నవారు కింద ఇచ్చిన పాయింట్లను పరిశీలించగలరు.

రిక్వైర్‌మెంట్ ఇదే..

  • అర్హత: ఎలక్ట్రికల్ ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
  • వయోపరిమితి: 12.12.2023 నాటికి 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తాయి.
  • అప్లికేషన్ ఫీజు: జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.200. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ఎక్స్–సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
  • అప్లై ప్రొసెస్: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • సెలక్షన్ ప్రాసెస్: సీబీటీ రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
  • జీతం: ఎంపికైన అభ్యర్థులకు ట్రైనింగ్ పీరియడ్‌లో నెలకు రూ.18,500 స్టైపెండ్‌గా ఇస్తారు. ఆ నెలకు రూ.21,500-రూ.74000 పే స్కేల్ అమలుచేస్తారు.

ఇలా అప్లై చేయండి..

  • అభ్యర్థులు PGCIL అధికారిక వెబ్​సైట్​ https://www.powergrid.in/ ఓపెన్ చేయాలి.
  • Careers సెక్షన్​లోకి వెళ్లి, జాబ్​ ఆపర్చ్యూనిటీస్​ చూసుకోవాలి.
  • Recruitment of Junior Technician Trainee లింక్​పై క్లిక్ చేసి ఓపెన్ చేయాలి.
  • అప్లికేషన్ ఫారమ్​లో మీ వ్యక్తిగత, విద్యార్హత వివరాలు నమోదు చేయాలి.
  • అప్లికేషన్ ఫీజు కూడా ఆన్​లైన్​లోనే చెల్లించాలి.
  • తరువాత అన్ని వివరాలు సరిచూసుకుని అప్లికేషన్​ను సబ్మిట్ చేయాలి.
  • రిఫరెన్స్ కోసం అప్లికేషన్​ ప్రింట్​అవుట్​ను భద్రపరుచుకోవాలి.

ముఖ్యమైన తేదీలు..

  • దరఖాస్తు స్వీకరణ ప్రారంభ తేదీ : 2023 నవంబర్​ 22
  • దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2023 డిసెంబర్​ 12
  • పరీక్ష తేదీ : 2024 జనవరి


Tags:    

Similar News