Group- 3: గ్రూప్-3 అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. కీలక ఉత్తర్వులు జారీ
రాష్ట్రంలో గ్రూప్-3 ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ గుడ్ న్యూస్ చెప్పింది. దరఖాస్తుల్లో సవరణలకు అవకాశం కల్పిస్తూ టీఎస్పీఎస్సీ ఉత్తర్వులు జారీ చేసింది. అభ్యర్థులు ఈ నెల 16 నుంచి 21వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు తమ అప్లికేషన్లు ఎడిట్ చేసుకోవచ్చు. కాగా, అభ్యర్థులకు ఒక్కసారి మాత్రమే ఎడిట్ చేసుకునే అవకాశం ఇస్తున్నామని.. దీన్నే ఫైనల్ డేటాగా పరిగణిస్తామని టీఎస్పీఎస్సీ తెలిపింది. గతేడాది (2022) డిసెంబర్ 30న రాష్ట్రంలోని వివిధ శాఖల్లో గ్రూప్-3 కేటగిరీలో 1,375 ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అందులో మరో 13 ఉద్యోగాలను జతచేస్తూ జూన్ 2023లో టీఎస్పీఎస్సీ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం.. ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఐ అండ్ కాడ్‌లో కొత్తగా మరో 13 ఉద్యోగాలను జత చేస్తున్నట్టు తెలిపింది. కొత్తగా కలిపిన ఉద్యోగాలతో ఈ 13 ఉద్యోగాలు కలిపితే మొత్తం గ్రూప్-3 ఉద్యోగాల సంఖ్యం 1388కి పెరిగింది.