గ్రూప్ - 2 పరీక్షలు వాయిదా.. కేసీఆర్ ఆదేశం

Update: 2023-08-12 17:26 GMT

గ్రూప్‌-2 అభ్యర్థుల వినతిని తెలంగాణ ప్రభుత్వం మన్నించింది. ఈనెల 29, 30 తేదీల్లో నిర్వహించ తలపెట్టిన గ్రూప్-2 పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈమేరకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీచేశారు. పరీక్షలను రీ షెడ్యూల్ చేయాలని ముఖ్యమత్రి ఆదేశించినట్లు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి పబ్లిక్ సర్వీస్ కమిషన్‌తో సంప్రదింపులు జరిపి, అభ్యర్థులు నష్టపోకుండా చూడాలని ప్రభుత్వ కార్యదర్శి శాంతకుమారిని సీఎం ఆదేశించారని వెల్లడించారు. నోటిఫికేషన్ ప్రకారం ఆగస్టు 29, 30 తేదీలలో గ్రూప్ 2 పరీక్ష జరగాల్సి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 1539 సెంటర్లలో గ్రూప్ 2 పరీక్ష నిర్వహించేందుకు స్కూళ్లు, కాలేజీలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. పరీక్షకు దరఖాస్తు చేసిన అభ్యర్థుల్లో కొంతమంది గ్రూప్ 2 వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. వరుసగా పరీక్షలు ఉన్నందున గ్రూప్ 2ని రీ షెడ్యూల్ చేయాలని 150 మంది హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. గురుకుల, గ్రూప్-2 సిలబస్ వేర్వేరు కావటంతో రెండింటిలో ఏదో ఒక పరీక్షకు మాత్రమే సన్నద్ధమయ్యే పరిస్థితి ఉంటుందని అభ్యర్థులు కోరారు.  ఒక్క ఆగస్టు నెలలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే 21 పరీక్షలు జరుగుతున్నాయని, వాయిదా వేయాలని అభ్యర్థించారు.




 




 


Tags:    

Similar News