సర్వర్ ప్రాబ్లెం.. రోడ్డెక్కిన పీజీటీ అభ్యర్థులు

Update: 2023-08-21 06:13 GMT

గురుకుల పీజీటీ పరీక్ష రాసేందుకు వచ్చిన అభ్యర్థులు రోడ్డెక్కారు. తమకు న్యాయం చేయాలంటూ జతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. సర్వర్ లో సమస్య తలెత్తిన కారణంగా పరీక్ష నిర్వహించకపోవడంపై అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. నిరసన చేపట్టిన పోలీసులు వారిని చెదరగొట్టారు. తమకు న్యాయం చేయాలంటూ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.

గురుకుల పిజీటీ ఇంగ్లీష్ ఎగ్జామ్ ఈ రోజు ఉదయం 8:30 నుంచి 10:30 వరకు జరగాల్సి ఉంది. ఈ క్రమంలో హయత్ నగర్లోని అయాన్ డిజిటల్ జోన్ ఎగ్జామినేషన్ సెంటర్ లో వద్దకు పలువురు అభ్యర్థులు పరీక్ష రాసేందుకు వచ్చారు. అయితే నిర్వాహకులు వారిని లోపలికి అనుమతించలేదు. సర్వర్ లో ప్రాబ్లెం ఉందంటూ పరీక్ష నిర్వహించలేదు. ఎగ్జామ్ సమయం పూర్తైనా పరీక్ష నిర్వహించకపోవడంతో అభ్యర్థులు ఆందోళనకు దిగారు.

హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపైకి వచ్చి బైఠాయించారు. ఎగ్జామినేషన్ సెంటర్ సిబ్బందిగానీ, ప్రభుత్వ అధికారులు గానీ తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని, అసలు తమ భవిష్యత్ ఏంటో అర్థం కావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పీజీటీ అభ్యర్థుల రాస్తారోకోతో నేషనల్ హైవేపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా తాము పరీక్ష రాయలేకపోయామని ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News