డిగ్రీ కాలేజీల్లో 2,858 పోస్టుల భర్తీ..ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

Update: 2023-07-06 15:18 GMT

డిగ్రీ కాలేజీల్లో 2,858 పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని డిగ్రీ కాలేజీల్లో వివిధ విభాగాలకు గాను కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఇందులో 527 లెక్చరర్ పోస్టులు, 50 టీఎస్‌కేసీ ఫుల్ టైమ్ మెంట‌ర్ల‌ు, 1,940 గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల‌తో పాటు సీనియర్ అసిస్టెంట్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లు, స్టోర్ కీపర్‎లు , జూనియర్ స్టెనో, రికార్డు అసిస్టెంట్, మ్యూజియం కీపర్, హెర్బేరియం కీపర్, మెకానిక్, ఆఫీసు సబార్డినేట్ వంటి పోస్టులను భ‌ర్తీ చేయ‌నున్న‌ట్లు సర్కార్ ఉత్త‌ర్వుల్లో పేర్కొంది . అయితే ఈ పోస్టుల కాల‌ప‌రిమితి 2024, మార్చి 31తో ముగియ‌నుంది. అర్హులైన వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

పోస్టుల వివ‌రాలు..

లెక్చ‌ర‌ర్లు : 527

టీఎస్‌కేసీ ఫుల్ టైమ్ మెంట‌ర్లు : 50

గెస్ట్ ఫ్యాక‌ల్టీ : 1,940

సీనియ‌ర్ అసిస్టెంట్ : 29

డాటా ఎంట్రీ ఆప‌రేట‌ర్ : 31

స్టోర్ కీప‌ర్ : 40

జూనియ‌ర్ స్టెనో : 01

రికార్డు అసిస్టెంట్ : 38

మ్యూజియం కీప‌ర్ : 07

హెర్బేరియం కీప‌ర్ : 30

మెకానిక్ : 08

ఆఫీసు సబార్డినేట్ : 157

Tags:    

Similar News