తెలంగాణలో గెస్ట్ లెక్చరర్ల నియామకానికి ప్రభుత్వం అంగీకరించింది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 1,654 మంది అధ్యాపకుల నియామకానికి పచ్చ జెండా ఊపింది. ఇంటర్మీడియెట్ కమీషనర్ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు. నియామక మార్గదర్శకాలను కూడా విడుదల చేశారు.
తెలంగాణ గెస్ట్ లెక్చరర్ల నియామకంలో ప్రభుత్వం జారీ చేసిన రూల్స్ ఇలా ఉన్నాయి. అధ్యాపకులకు ఒక్కో పీరియడ్ కు 390 రూ. చెల్లిస్తుంది. నెలకు 72 పీరియడ్లకు మాత్రమే అనుమతినిస్తుంది. దీన్నిబట్టి వారికి నెలకు 28,080 రూ. జీతం వస్తుంది. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో జిల్లా ఇంటర్ విద్యాశాఖాధికారి, కాలేజి ప్రిన్సిపాళ్ళు నియామక కమిటీని ఏర్పాటు చేస్తారు. ఈరోజు కాలేజీల వారీగా ఖాళీలను ప్రకటిస్తారు. 24లోగా అన్ని అర్హతలు ఉన్నావారు దరఖాస్తు చేసుకోవాలి.
26వ తేదీన దరఖాస్తులను పరిశీలించి మెరిట్ అభ్యర్ధుల జాబితాను తయారుచేస్తారు. 28న జిల్లా కలెక్టర్ ఎంపికైన వారి లిస్ట్ ప్రకటిస్తారు. వచ్చే నెల 1 నుంచి ఎన్నికైన వారు కాలేజీల్లో రిపోర్ట్ చేయాలి. అయితే ఇంతకు ముందు పనిచేసిన గెస్ట్ లెక్చరర్ల పరిస్థితి ఏంటో చెప్పలేదు గవర్నమెంట్. వారిని తిరిగి కొనసాగించకపోవడంతో ఆందోళన నెలకొంది.