నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 1876 ఎస్​ఐ​ పోస్టులకు SSC నోటిఫికేషన్..

Update: 2023-07-22 07:05 GMT

నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గుడ్ న్యూస్ చెప్పింది. పోలీస్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న వారి కోసం జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. SSC కి చెందిన సెంట్రల్​ పోలీస్ ఆర్గనైజేషన్​ 1876 ఎస్ఐ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులు బీఎస్​ఎఫ్​, సీఐఎస్​ఎఫ్​, ఢిల్లీ పోలీస్​, సీఆర్పీఎఫ్​, ఐటీబీపీ, ఎస్​ఎస్​బీలలో పనిచేయాల్సి ఉంటుంది.

ఢిల్లీ పోలీస్ డిపార్ట్​మెంట్​ - 106 పోస్టులు, బీఎస్​ఎఫ్​ - 113, సీఐఎస్​ఎఫ్​ - 630, సీఆర్​పీఎఫ్​ - 818, ఐటీబీపీ - 63, ఎస్​ఎస్​బీ - 90 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజైంది. అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ చేసి ఉండాలి. అభ్యర్థులు అగస్ట్ 15వరకు దరఖాస్తు చేసేకోవచ్చు. అక్టోబర్ 3 నుంచి 6వరకు ఎగ్జామ్స్ ఉంటాయి.

అభ్యర్థుల వయస్సు 2023 ఆగస్టు 1 నాటికి 20 ఏళ్లు నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు, ఎక్స్​ సర్వీస్​మెన్​కు 3ఏళ్ల వయోపరిమితి సడలింపులు ఉంటాయి.

అభ్యర్థులను నాలుగు దశల్లో ఎంపిక చేస్తారు..

స్టేజ్​ 1 : పేపర్​ 1 - కంప్యూటర్​ బేస్డ్​ టెస్ట్​

స్టేజ్​ 2 : ఫిజికల్ స్టాండర్డ్​ టెస్ట్​ (పీఎస్​టీ) & ఫిజికల్​ ఎఫీషియన్సీ టెస్ట్​ (పీఈటీ)

స్టేజ్​ 3 : పేపర్​ 2 - కంప్యూటర్​ బేస్డ్​ టెస్ట్​

స్టేజ్​ 4 : మెడికల్​ ఎగ్జామినేషన్​

ఈ పోస్టులకు ఆసక్తి గల అభ్యర్థులు ssc.nic.in వెబ్​సైట్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.




Tags:    

Similar News