బిగ్ బాస్ హౌస్లోకి జబర్దస్త్ ముద్దుగుమ్మ.. క్లారిటీ ఇచ్చేసిందిగా..!

Update: 2023-07-23 12:36 GMT

అందంతో పాటు అమాయకపు మాటలతో అందరినీ ఆకట్టుకుంటోంది జబర్దస్త్ వర్ష. కామెడీ షో జబర్దస్త్తో టీవీ ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తక్కువ కాలంలోనే పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇప్పుడిప్పుడే సినిమాల్లోనూ అవకాశాలు అందిపుచ్చుకుంటోంది. తాజాగా ఈ అమ్మడికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. త్వరలో ప్రారంభంకానున్న బిగ్ బాస్ సీజన్ 7లో వర్ష పార్టిసిపేట్ చేయబోతోందని టాక్ వినిపిస్తోంది.




 


ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వర్ష తనకు సినిమా ఆఫర్లు వస్తున్నాయని చెప్పింది. అయితే క్యారెక్టర్ ఆర్టిస్టుగా అడుగుతున్నారని అలాంటి రోల్స్ చేయడం తనకు ఇష్టం లేదని చెప్పింది. త్వరలోనే ఓ పెద్ద షోలో కనిపించబోతున్నట్లు ప్రకటించింది. తనకు, తన జీవితానికి సంబంధించిన చాలా విషయాలు ఆ షోలో వెల్లడిస్తానని వర్ష చెప్పింది.


 



వర్ష త్వరలో కనిపించనున్న ఆ పెద్ద షో బిగ్ బాస్ సీజన్ 7 అని సోషల్ మీడియా కోడై కూస్తోంది. బిగ్ బాస్ తెలుగు దాదాపు అన్ని సీజన్లలో జబర్దస్త్ నుంచి ఒకరు హౌస్ లోకి వెళ్తున్నారు. గత సీజన్ లో చలాకీ చంటి, ఫాయిమా ఎంట్రీ ఇచ్చారు. అదే క్రమంలో ఈసారి వర్ష బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తుందని అంటున్నారు. ఇంతకీ బిగ్బాస్ సీజన్ 7లో వర్ష ఎంట్రీ ఉంటుందా లేదా తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.


 



 




 


 

Tags:    

Similar News