seeking bride: 'వధువు కావలెను'.. ఈ- రిక్షా డ్రైవర్ వినూత్న ప్రకటన

కులమతాలు అక్కర్లేదు.. అమ్మాయి అయితే చాలు

By :  Kiran
Update: 2024-02-19 02:45 GMT


తల్లిదండ్రులు తన పెళ్లి ఊసు ఎత్తడం లేదని, మ్యారేజీ బ్యూరోని సంప్రదించినా పని అవ్వడం లేదని ఓ వ్యక్తి... 'వధువు కావలెను' అంటూ తన రిక్షాకు ఓ బోర్డు తగిలించుకు తిరుగుతున్నాడు. కులం, మతం ఏదైనా పర్లేదు.. వయస్సులో తన కన్నా తక్కువున్న అమ్మాయి అయితే చాలని చెబుతున్నాడు. మధ్యప్రదేశ్‌లోని దమోహ్‌ నగరవాసి దీపేంద్ర రాఠోడ్‌ (29).. ఈ-రిక్షా నడుపుతూ తల్లిదండ్రుల్ని పోషిస్తూ.. జీవనం సాగిస్తున్నాడు. ఆర్థికంగా కాస్త స్థిరపడడంతో ఇక పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ అతడి తల్లిదండ్రులు పూజలు పునస్కారాలతో బిజీగా ఉంటూ.. నీకు కావాల్సిన పిల్లను నువ్వే చూసుకో అంటూ పర్మిషన్ ఇచ్చారు. ఇందుకోసం అతడు తెలిసిన వాళ్లని పెళ్లి గురించి అడిగాడు. ఓ మ్యారేజ్ బ్యూరోని సంప్రదించినా.. లాభం లేకపోయింది.




 


దీంతో అతడు.. తన ఈ-రిక్షాకు ఓ హోర్డింగు కట్టుకొని.. ఆ హోర్డింగుపై తన ఫొటోతోపాటు ఎత్తు, పుట్టినతేదీ, బ్లడ్‌ గ్రూపు, విద్యార్హతలు, గోత్రం వంటి వివరాలన్నీ ఉంచాడు. కులం, మతం వంటి పట్టింపులు లేవు, స్థానికేతరులైనా ఫర్వాలేదని చెబుతున్నాడు. సమాజంలో అమ్మాయిలు తక్కువయ్యారని, తనకేమో పెళ్ళి వయస్సు దాటిపోతుందని వాపోతున్నాడు. ఈ-రిక్షా సాయంతో కుటుంబాన్ని పోషిస్తున్న దీపేంద్ర తన జీవిత భాగస్వామి ఎప్పుడూ సంతోషంగా ఉండేలా చూస్తానని అంటున్నాడు.


Tags:    

Similar News