సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మళ్లీ పుట్టాడు.. వైరల్ వీడియోలు!
ఆకట్టుకునే రూపం, చక్కని నటనతో కోట్లమంది హృదయాలను కొల్లగొట్టి అర్ధంతరంగా వెళ్లిపోయాడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్. బాలీవుడ్‌లో ప్రామిసింగ్ స్టార్‌గా చేసింది కొన్ని చిత్రాలే అయినా మంచిమనసుతో, గుండెను కలచివేసే ఆత్మహత్యతో మూడేళ్ల కిందట దూరమైన అతణ్ని బాలీవుడ్ ప్రేక్షకులు మరిచిపోలేకపోతున్నారు. తాజాగా ‘సుశాంత్ మళ్లీ పుట్టాడు’ అంటూ కొన్ని వీడియోలను విపరీతంగా షేర్ చేస్తున్నారు. ముమ్మూర్తులా సుశాంత్‌లాగే ఉన్న కుర్రాడి వీడియోలు అవి. తలకట్టు, నవ్వు, గడ్డం, ఆకారం అన్నీ అచ్చం సుశాంత్‌ను పోలినట్టే ఉండడంతో అతడు మళ్లీ వచ్చేశాడని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో డోనిమ్ అయాన్ అనే యూజర్ తన వీడియోలంటూ పోస్ట్ చేస్తున్న వీడియోలు చూసి జనం తల విదిలించుకుంటున్నారు. అచ్చం సుశాంత్‌లాగే ఉన్నాడని చెక్ చేసి మరీ చూస్తున్నారు. అయితే అవి ఆర్టిఫీషిల్ ఇంటెలిజెన్స్‌తో తయారైన వీడియోలు కావొచ్చని కొందరు కూపీ లాగుతున్నారు. డీప్ ఏఐ టెక్నాలతో ఇలాంటి మాయ చేయొచ్చని చెబుతున్నారు. అయాన్ ఈ ఏడాది జూన్ 26 నుంచి మాత్రమే వీటిని పోస్టుతున్నాడని, అతడు నిజంగానే సుశాంత్‌లా ఉంటే ఇన్నేళ్లూ నిద్రపోతున్నాడా అని అని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి డోనిమ్ అయాన్ రియలో ఫేకో తెలియకపోయినా దివంగత నటుడిని జనం మరోసారి తలచుకుంటున్నారు.