లక్షకుపైగా కార్లు రీకాల్ చేసిన మహీంద్రా.. రీజన్ ఏంటంటే..?

Update: 2023-08-19 10:38 GMT

ఆటోమొబైల్‌ దిగ్గజం మహీంద్రా అండ్‌ మహీంద్రా భారీ సంఖ్యలో వెహికిల్స్ రీకాల్‌ చేస్తోంది. XUV 700 మోడల్ కు చెందిన లక్ష కార్లను వెనక్కి రప్పిస్తున్నట్లు ప్రకటించింది. వైరింగ్‌ లో లోపం ఉన్నట్లు గుర్తించామని, వాటిని సరిచేసి తిరిగి కస్టమర్లకు అప్పగిస్తామని మహీంద్రా కంపెనీ స్పష్టం చేసింది. ఇంజిన్ బేలో వైరింగ్ లూమ్ రూటింగ్ లో ఉన్న లోపాల కారణంగా సమస్యలు తలెత్తే అవకాశమున్నందున నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. ఈ క్రమంలో 2021 జూన్‌ 8 నుంచి 2023 జూన్‌ 28 మధ్య ఉత్పత్తి చేసిన 1,08,306 కార్లను రీకాల్ చేసినట్లు ప్రకటించింది.




 


XUV 700తో పాటు XUV400 ఎస్‌యూవీలను సైతం మహీంద్రా అండ్ మహీంద్రా రీకాల్‌ చేస్తోంది. 2023 ఫిబ్రవరి 16 నుంచి 2023 జూన్‌ 5 మధ్య ఉత్పత్తైన 3,560 యూనిట్లను వెనక్కి రప్పిస్తున్నట్లు చెప్పింది. XUV 400లో బ్రేక్ పొటెన్షియో మీటర్‌లో స్ప్రింగ్ రిటర్న్‌ యాక్షన్‌లో లోపాలు తలెత్తే అవకాశమున్నట్లు గుర్తించినట్లు ప్రకటించింది. వాటిని రిపేర్ చేసి ఇస్తామని చెప్పింది. రీకాల్ కు సంబంధించి సదరు కార్ల యజమానులకు పర్సనల్ గా మెసేజ్ పంపనున్నట్లు మహీంద్రా అండ్ మహీంద్రా చెప్పింది.




Tags:    

Similar News