లోకల్ ట్రైన్‌లో డ్యాన్స్ చేస్తూ రెచ్చిపోయిన యువతి

లోకల్ ట్రైన్‌లో డ్యాన్స్ చేస్తూ రెచ్చిపోయిన యువతి;

By :  Kiran
Update: 2024-02-25 05:08 GMT



సోషల్ మీడియా మోజులో పడిన చాలామందికి కిందా మీదా తెలియట్లేదు. ఎక్కడపడితే అక్కడ, ఏదీ పడితే అది ఇష్టారీతిలో రీల్స్, వీడియోలు చేస్తూ పాపులర్ అయ్యేందుకు ప్రవర్తిస్తున్నారు. నలుగురిలో ఉన్నామన్న సోయి కూడా లేకుండా బరితెగిస్తున్నారు. వైరైటీ అంటూ, ట్రెండింగ్ అంటూ.. వారికి వారే ఇష్టమొచ్చిన పేర్లు పెట్టుకుంటూ.. జనాలకు వాళ్ల టాలెంట్ చూపెట్టి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. తాజాగా లోకల్ ట్రైన్‌లో ఓ యువతి చేసిన డ్యాన్ కాస్త అటుఇటుగా అలాగే ఉంది.

ముంబైలోని లోకల్ ట్రైన్‌లోని లేడీస్ బోగిలో ఓ అమ్మాయి, బ్లాక్ డ్రెస్‌లో సైయా మారే సాతా సాత్ అనే పాటకు డ్యాన్స్ చేస్తూ, ఉన్న వీడియో షేర్ చేయగా ఇది చాలా ట్రెండ్ అవుతుంది. ఇక ఈ వీడియోలో ఆమె డ్యాన్స్ చేస్తుండగా, అందులో ఉన్న కొందరు ప్రయాణికులు తమ ముఖం దాచుకోగా, ఇష్టం లేని వారు ట్రైన్ దిగి వెళ్లిపోయారు. దీంతో ఈ రీల్ గమనించిన రైల్వే అధికారులు. ఈ ఘటనపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ముంబై రైల్వే పోలీస్ కమిషనరేట్ సెంట్రల్ రైల్వే సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ను ఆదేశించింది. ఇక ఇది చూసిన నెటిజన్స్, ట్రైన్‌లో ఇలా డ్యాన్స్ చేయడం తప్పు, అంత అసభ్యకరంగా డ్యాన్స్ చేయాలా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


Tags:    

Similar News