రోడ్లపై కరెన్సీ నోట్లు చల్లుతూ వీడియో.. గట్టి షాకిచ్చిన పోలీసులు

రోడ్లపై కరెన్సీ నోట్లు చల్లుతూ వీడియో.. గట్టి షాకిచ్చిన పోలీసులు

By :  Kiran
Update: 2024-02-25 02:25 GMT



రద్దీగా ఉండే రోడ్డుపై రేంజ్ రోవర్ కారులో ప్రయాణిస్తూ.. కరెన్సీ నోట్లు వెదజల్లాడో వ్యక్తి. తాను చేసిన ఘనకార్యానికి సంబంధించిన వీడియోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇదంతా కేవలం లైకులు, షేర్లు కోసమే చేసినట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ లో ఈ ఘటన జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఓ వ్యక్తి రేంజ్ రోవర్ కారులో ప్రయాణిస్తూ.. రోడ్లపై నోట్లు జల్లుతూ వెళ్లాడు. ఆ లగ్జరీ కారులో మొత్తం ముగ్గరు ప్రయాణిస్తుండగా.. ముందు సీటులో డ్రైవర్ పక్కనున్న వ్యక్తి నోట్లను బయటకు విసురుతున్నాడు. మరో కారులోని వ్యక్తి ఈ తతంగాన్నంతా వీడియో తీస్తున్నాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా, కొద్ది సేపటికే వైరల్ గా మారింది. దీంతో ఈ వీడియోని నెటిజన్లు తెగ షేర్ చేస్తూ.. కామెంట్లతో తిట్టిపోస్తున్నారు. కాస్తైనా సివిక్ సెన్స్ లేకుండా నడిరోడ్లపై ఈ వేషాలేంటని ప్రశ్నిస్తున్నారు.

ఆ నెటిజన్లలోని ఓ వ్యక్తి యూపీ పోలీసులను ట్యాగ్ చేస్తూ.. షేర్ చేశాడు. అంతేగాక, ఇలాంటి ఘటనలు జరుగుతుంటే పోలీసులు చర్యలు తీసుకోరా..? ఆ సమయంలో నోట్ల కోసం జనాలు రోడ్ల పైకి వస్తే ప్రమాదాలు జరగవా అని ప్రశ్నించారు. అయితే దీనిపై పోలీసులు స్పందించి, ఫిర్యాదు నమోదు చేసుకొని, ట్రాఫిక్ నిబందనల్లో ఐదు ఉల్లంఘనలకు సంబందించి 21 వేల రూపాయలు జరిమానా విదించారు. దీనిని ఎక్స్ లో పోస్టు చేసి, మోటారు వాహానాల చట్టం, 1988 కింద చర్యలు తీసుకున్నాం అని ఎక్స్ లో రాసుకొచ్చారు. అంతేగాక ట్రాఫిక్ నిబందనలు ఉల్లంఘింస్తే ట్రాఫిక్ హెల్ప్ లైన్ నంబర్ కి కాల్ చేయాలని తెలిపారు.


 



Tags:    

Similar News