Narayana Swamy : ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామిపై కేసు నమోదు

Byline :  Vijay Kumar
Update: 2024-01-08 16:08 GMT

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం నారాయణ స్వామిపై హైదరాబాద్ లోని బేగంబజార్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీపై ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఫిర్యాదు చేశారు. సోనియా గాంధీపై అవాస్తవాలు మాట్లాడిన నారాయణస్వామిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన తన ఫిర్యాదులో కోరారు. ఉమ్మడి ఏపీలో ఆనాడు సీఎంగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోనియా గాంధీ అధిక ప్రాధాన్యం ఇచ్చారని మల్లు రవి తెలిపారు. వైఎస్ హెలికాప్టర్ ప్రమాదం జరిగినప్పుడు ప్రత్యేక విమానాలు పంపించి జాడ కోసం వెతికించారని, వాతావరణం సరిగా లేకపోవడం వల్లే హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మరణించారని తెలిపారు. ఈ విషయాన్ని నారాయణ స్వామి గ్రహించాలని అన్నారు. ఇప్పటికైనా నారాయణస్వామి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని మల్లు రవి హెచ్చరించారు.




Tags:    

Similar News