జనసేన ప్రెస్ మీట్లో సీఎం జగన్ కటౌట్

Update: 2024-01-29 10:35 GMT

ఏపీలో కొత్త ట్రెండ్ నడుస్తోంది. ఒక పార్టీ మీటింగ్ ఇంకో పార్టీల నేతల ఫ్లెక్సీలు, కటౌట్లు పెడుతున్నారు. ఇటీవల భీమిలిలో వైసీపీ నిర్వహించిన 'సిద్ధం' బహిరంగ సభా ప్రాంగణంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తో పాటు ఏపీ కాంగ్రెస్, బీజేపీ నేతల కార్టూన్ కటౌట్లు పెట్టారు. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ కటౌట్ ఎదురుగా ఏకంగా బాక్సింగ్ కిక్ బ్యాగ్ ను పెట్టగా మీటింగ్ కు వచ్చిన వైసీపీ కార్యకర్తలు ఆ బ్యాగ్ ను కొడుతూ కనిపించారు. కాగా తాజాగా వైసీపీ చర్యలకు కౌంటర్ గా జనసేన ప్రెస్ మీట్ నిర్వహించింది. జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రెస్ మీట్ లో ఏపీ సీఎం జగన్ కటౌట్ ను పెట్టారు. నాదెండ్ల మనోహర్ పక్క చైర్ లో జగన్ కటౌట్ ను పెట్టారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై మాట్లాడటానికి మీడియా ముందుకు రావడానికి ముఖం చాటేసే సీఎం జగన్ ను చీఫ్ గెస్ట్ గా ప్రెస్ మీట్ కు తీసుకొచ్చామని ఎద్దేవా చేశారు. జగన్ ప్రభుత్వ లెక్కల్లో జరిగిన తప్పులపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, మరి సీఎం జగన్ సిద్ధమా అని సవాలు విసిరారు. తాము ఎక్కడికి పిలిచిన జగన్ అవినీతిపై చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

Tags:    

Similar News