జనసేన తన రాష్ట్ర ప్రచార కమిటీని ప్రకటించింది. ఇటీవలే జనసేన పార్టీలో చేరిన టాలీవుడ్ నిర్మాత బన్నీ వాస్ ను ఈ కమిటీకి చైర్మన్ గా నియమించారు. అలాగే కొన్నిరోజుల కిందటే జనసేన తీర్థం పుచ్చుకున్న స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు ఈ కమిటీ వైస్ చైర్మన్ బాధ్యతలు అప్పగించారు. మరో వైస్ చైర్మన్ గా యాతం నగేశ్ బాబు, కార్యదర్శిగా వబిలిశెట్టి రామకృష్ణ, సంయుక్త కార్యదర్శులుగా పోగిరి సురేశ్ బాబు, బెల్లంకొండ అనిల్ కుమార్, బండి రమేశ్ కుమార్ నియమితులయ్యారు. ఉమ్మడి జిల్లా జనసేన సమన్వయకర్తలను కూడా ప్రకటించారు.