'రాజధాని ఫైల్స్' సినిమాను చూడండి.. Chandrababu Naidu

Byline :  Vijay Kumar
Update: 2024-02-16 12:50 GMT

'రాజధాని ఫైల్స్' చిత్రాన్ని ప్రతి ఒక్కరూ చూడాలని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పై విరుకుపడ్డారు. సీఎం స్థానంలో ఉన్న ఓ వ్యక్తి రాష్ట్ర రాజధానిగా ఉన్న అమరావతిపై పగబట్టి దానిని సర్వనాశనం చేశారని అన్నారు. అందుకోసం కులాల కుంపట్లు రాజేశారని, విష ప్రచారం చేయించారని అన్నారు. అధికార బలం మొత్తం ఉపయోగించి ఉద్యమకారులను చిత్ర హింసలకు గురిచేశారని మండిపడ్డారు. ఈ కుట్రలకు, దారుణాలకు అద్దం పట్టిన చిత్రం 'రాజధాని ఫైల్స్' అని స్పష్టం చేశారు. జగన్ క్రూరత్వానికి, వైసీపీ విధ్వంసానికి నాశనమైన ప్రాంతం అమరావతి అని అన్నారు. దాని కోసం ఎన్నో త్యాగాలు చేసిన ప్రజలు ఎదుర్కొన్న కష్టాలను ఈ చిత్రం కళ్లకు కట్టిందని చంద్రబాబు వివరించారు. అందుకే ఈ చిత్రం విడుదల కాకుండా ఆపాలని జగన్ శతవిధాలా ప్రయత్నించారని, కానీ కోర్టు అతడి ఆటలను సాగనివ్వలేదని తెలిపారు.

'రాజధాని ఫైల్స్' సినిమా ప్రదర్శనకు కోర్టు అనుమతి ఇచ్చిందని, తెలుగు ప్రజలందరూ థియేటర్లకు వెళ్లి సినిమాను చూసి వాస్తవాలు తెలుసుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. "జగన్ రెడ్డీ.. నీ సినిమా అయిపోయింది. అసలు సినిమా ఇప్పుడు మొదలవుతోంది. ఇక కాస్కో" అంటూ సవాల్ విసిరారు.

కాగా ఈ 'రాజధాని ఫైల్స్' సినిమాను.. అమరావతి కోసం భూములు ఇచ్చిన తర్వాత ప్రభుత్వం వారిని ఏ విధంగా చూసింది. అనంతరం రాజధాని మార్పుతో ఆ ప్రాంత ప్రజల తిరుగుబాటు, వారిని ప్రభుత్వం ఏ విధంగా అనిచి వేసిందనే కాన్సెప్ట్ తీశారు. ఈ సినిమాకు భాను శంకర్ దర్శకత్వం వహించగా కె.రవిశంకర్ నిర్మించారు. ఈ సినిమాలో అఖిలన్ పుష్పరాజ్, విశాల్ పతి, వినోద్ కుమార్, వాణి విశ్వనాథ్ వంటి నటులు నటించారు. కాగా ఈ సినిమా ఇవాళ విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది.

Tags:    

Similar News