టీడీపీ-జనసేన కూటమి సూపర్ హిట్ అని మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం శ్రీకాకులంలో జరిగిన టీడీపీ రా.. కదలిరా బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. టీడీపీ-జనసేన పొత్తును చూసి అధికార వైసీపీ నాయకులకు ప్యాంట్లు తడిచిపోతున్నాయని ఎద్దేవా చేశారు. ప్రజల భవిష్యత్తు బాగుండాలంటే టీడీపీ-జనసేన ప్రభుత్వం రావాలని చంద్రబాబు అన్నారు. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపి సుపరిపాలన అందిస్తామని అన్నారు. తమ ప్రభుత్వం రాగానే యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పిస్తామని అన్నారు. ప్రభుత్వం సంపద సృష్టించి పేదలకు పంచుతామని అన్నారు.
మద్యం దోపిడీని అరికడుతామని, ఇసుక మాఫియాను రూపుమాపుతామని హామీ ఇచ్చారు. రైతు సబ్సిడీని తిరిగి ప్రారంభిస్తామని అన్నారు. విశాఖను గంజాయి, నేరాలకు రాజధానిగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కు ఉత్తరాంధ్ర మీద ప్రేమ లేదని, ఇక్కడి భూములపైనే ఆయనకు ప్రేమ అని అన్నారు. ఉత్తరాంధ్రను ఉద్ధరిస్తామని చెప్పి సర్వ నాశనం చేశారని అన్నారు. కులాలా, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి అభ్యర్థులు దొరకడం లేదని సెటైర్లు వేశారు. నీచ రాజకీయాలు స్వస్తి పలికి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని అన్నారు. వైసీపీ విముక్త రాష్ట్రాన్ని తయారు చేసుకుందాం అని పిలుపునిచ్చారు. రాజకీయాలకు అర్హతలేని జగన్ ను చిత్తుగా ఓడించాలి అని అన్నారు.