మేనల్లుడి ఎంగేజ్మెంట్ కి హాజరైన సీఎం జగన్

Update: 2024-01-18 16:02 GMT

కాంగ్రెస్ పార్టీ ఏపీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి నిశ్చితార్థ వేడుకు హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. కాగా ఈ వేడుకకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తన సతీమణి భారతితో కలిసి హాజరయ్యారు. మేనల్లుడు రాజారెడ్డి, ఆయనకు కాబోయే భార్య ప్రియలను సీఎం జగన్ దంపతులు ఆశీర్వదించారు. అనంతరం ఇరు కుటుంబ సభ్యులతో ఫోటో దిగారు.

కాగా ఫిబ్రవరి 17న రాజారెడ్డి -అట్లూరి ప్రియ వివాహం జరగనుంది. తన కుమారిడి వివాహానికి షర్మిల పలువురు ప్రముఖులను ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ఖర్గేల, కేసీ వేణుగోపాల్ తో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తన సోదరుడు, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తదితరులను ఆహ్వానించారు.

Tags:    

Similar News