మా పార్టీ పదేళ్ల అరణ్యవాసం ముగిసింది.. మాజీ మంత్రి తులసిరెడ్డి

Byline :  Vijay Kumar
Update: 2023-12-31 10:26 GMT

మాజీ మంత్రి, ఏపీ కాంగ్రెస్ నేత తులసిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి పదేళ్ల అరణ్యవాసం ముగిసిందని అన్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. ఈక్రమంలోనే ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో ఏర్పడ్డ టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు ప్రజలను తీవ్రంగా మోసం చేశాయని మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడంలో టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని ఆరోపించారు. ఇక జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టేసిందని అన్నారు. ప్రజా సంక్షేమంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా వెనుకబడిపోయిందని అన్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని అన్నారు. కాగా 2014లో సమైక్యాంధ్రప్రదేశ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లుగా విడిపోయింది. రాష్ట్రాన్ని విడిగొట్టారంటూ ఏపీ ప్రజలు గత రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించలేదు. ఇక తెలంగాణలో గత రెండు దఫాలు బీఆర్ఎస్ అధికారం కైవసం చేసుకోగా తాజా ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ విజయం సాధించింది.

Tags:    

Similar News