ఆ ఐదుగురికి జగన్ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు.. Pawan Kalyan
ఐదు కోట్ల మంది ప్రజల రాష్ట్రాన్ని జగన్ ఐదు మందికి తాకట్టు పెట్టారని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ అన్నారు. బుధవారం తాడేపల్లిగూడెంలో టీడీపీ-జనసేన ఆధ్వర్యంలో జెండా బహిరంగ సభను నిర్వహించారు. ఈ సమావేశానికి ఇరు పార్టీల నేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ సిద్ధం సిద్ధం అంటున్న వైఎస్ జగన్ కు యుద్దం ఇద్దాం అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. వైఎస్ జగన్ రెడ్డి, పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డిలకు జగన్ రాష్ట్రాన్ని అప్పగించారని అన్నారు. ఈ ఐదుగురి వల్లే రాష్ట్రం అతలాకుతలం అయిందని అన్నారు. రాష్ట్రంలో ఏం విషయం అయినా వీళ్లే చేస్తారని అన్నారు. ఏదైనా మాట్లాడుదామంటే గూండాలతో బెదిరింపులు, రౌడీలతో వార్నింగ్ లు పరిపాటిగా మారాయని అన్నారు. ఈ ఐదేళ్లలో రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, అంగన్వాడీ కార్యకర్తలు.. ఇలా ప్రతి వర్గాన్ని జగన్ మోసం చేశారని ఆరోపించారు. వైపీసీ పాలనలో ఏపీ రోడ్లపై నీళ్లు, పాలు పోస్తే మళ్లీ గిన్నెల్లోకి ఎత్తుకోవచ్చని సెటైర్లు వేశారు. కత్తిపోట్లు, హత్యలు అంటే ఎవరికీ తెలియవు అని ఎద్దేవా చేశారు.
45 రోజుల తర్వాత వైసీపీ గూండాలు, రౌడీలకు తగిన గుణపాఠం చెబుతామని అన్నారు. తమ నాయకులు, కార్యకర్తలు, సామాన్య ప్రజలు దాడి చేస్తే.. వైసీసీ గూండాల మక్కిలిరుగగొట్టి మడత మంచంలో పడుకోబెడతామని అన్నారు. తమ పార్టీకి చెందిన ఒక్క ఎమ్మెల్యేను లాక్కున్న జగన్ ఒక్కడు ఎలా అవుతారని అన్నారు. టీడీపీ-జనసేన సహకరించుకుంటేనే ఐదు కోట్ల ఏపీ ప్రజలు బాగుంటారని అన్నారు. రాజకీయ ఉద్ధండుడు చంద్రబాబును 53 రోజులు జైలులో పెడితే తనకు బాధేసిందని అన్నారు. కౌలు రైతులు, రైతులు, కార్మికులు, పారిశ్రామిక వేత్తలు. ఇలా ప్రతి ఒక్కరినీ జగన్ మోసం చేశారని అన్నారు. జగన్ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని, గోబెల్స్ కు పట్టిన గతే జగన్ కు పడుతుందని అన్నారు. అమరావతే ఏపీకి రాజధానిగా ఉంటుందని స్పష్టం చేశారు. నోరు తెరిస్తే ప్రజలకు వేల కోట్ల డబ్బు పంచానని జగన్ చెబుతున్నారని, ఆయనేమైనా వాళ్ల తాత సంపాదించిన ఆస్తి ఇస్తున్నారా అని ప్రశ్నించారు. పది కిలోల బియ్యం తాము ఇవ్వమని, కానీ పాతి సంవత్సరాల భవిష్యత్తు ఇస్తామని అన్నారు.
పొద్దున పథకం ద్వారా డబ్బులిచ్చి సాయంత్రం సారాతో ఆ డబ్బును దోచుకెళ్తున్నారని అన్నారు. 24 సీట్లు తీసుకున్నారని అంటున్నారని, కానీ దాన్ని తాను పట్టించుకోనని అన్నారు. తమది ప్రస్తుతం ఓ చిన్న ఇళ్లని.. త్వరలోనే ఓ పెద్ద కోటని నిర్మిస్తామని అన్నారు. టీడీపీతో పోల్చుకుంటే తమ పార్టీ సంస్థాగతంగా బలహీనంగా ఉందని, అందుకే టీడీపీతో 24 ఎమ్మెల్యే సీట్లు, 3 ఎంపీ సీట్లకు ఒప్పుకున్నానని అన్నారు. రాజకీయంగా తన వ్యూహం తనకుందని, దాన్ని ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు.