పండుగ పూట నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ వేస్తాని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఈ విషయమై ఇప్పటికే సీఎం జగన్ మోహన్ రెడ్డి చర్చించారని అన్నారు. నోటిఫికేషన్ లో మొత్తం ఎన్ని పోస్టులు ఉంటాయి, ఉద్యోగాల భర్తీ తదితర వివరాలను త్వరలోనే తెలియజేస్తామని మంత్రి తెలిపారు. కాగా నిరుద్యోగులు ఎన్నో ఏళ్లుగా ఈ మెగా డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా ఏపీ ప్రభుత్వం ప్రకటనతో వాళ్లలో సంతోషం వ్యక్తమవుతోంది. వీలైనంత త్వరగా మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ను విడుదల చేయాలని, ఎన్నికల కోడ్ వచ్చేదాక చూడొద్దని నిరుద్యోగులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.