జనసేన ఎంపీ అభ్యర్థుల ఎంపిక..ఆ ముగ్గురు ఎవరో తెలుసా?
ఏపీ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. టీడీపీ-జనసేన ఓ కూటమిగా ఏర్పడి వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల టీడీపీ-జనసేన కూటమికి సంబంధించిన మొదటి జాబితాను ఇద్దరు నేతలు శనివారం విడుదల చేసిన విషయం తెలిసిందే. మొదటి జాబితాలో మొత్తం 118 స్థానాలకు గాను టీడీపీ 94 , జనసేన 24 సీట్లకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇక జనసేనకు మూడు ఎంపీ సీట్లు కూడా పొత్తులో భాగంగా దక్కాయి. ఇక 24 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల్లో 5 మంది అభ్యర్థుల పేర్లను పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో మూడు ఎంపీ స్థానాలకు కూడా అభ్యర్థులు ఫైనల్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. జనసేనకు కేటాయించిన ముగ్గురు ఎంపీ అభ్యర్థులు వీరే అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది.
జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు, వల్లభనేని బాలశౌరి, సానా సతీష్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇక నాగబాబు అనకాపల్లి నుంచి, వల్లభనేని బాలశౌరి మచిలీపట్నం నుంచి, సానా సతీశ్ కాకినాడ లోక్ సభ స్థానాల నుంచి పోటీ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రచారంలో ఎంత నిజం ఉన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే. కాగా టీడీపీ-జనసేన సీట్ల కేటాయింపుపై వైసీపీ సెటైర్లు వేస్తున్న విషయం తెలిసిందే. చంద్రబాబు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ను మోసం చేశారని, పవన్ కల్యాణ్ చంద్రబాబుకు బానిసలా మారారని వైసీపీ నేతలు అంటున్నారు. టీడీపీ-జనసేన కూటమి వైసీపీని ఓడించే ప్రసక్తిలేదని వారు అంటున్నారు.