Nara Lokesh : అర్జునుడు కాదు.. భస్మాసురుడు: సీఎం జగన్ పై లోకేశ్ ఫైర్
సీఎం జగన్అర్జునుడు కాదని.. ఆయన ఓ భస్మాసురుడని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. ఆదివారం విశాఖ సౌత్‌లో శంఖారావం సభ నిర్వహించారు. ఈ సభలో నారా లోకేశ్ ప్రసంగించారు. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు హయాంలో విశాఖను జాబ్ క్యాపిటల్‌గా చేస్తే జగన్ గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చారని విరుచుకుపడ్డారు. యూత్ గర్జనకు తాడేపల్లి పిల్లికి తడిసిపోతుందని సెటైర్లు వేశారు. భూ దందాకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఎమ్మార్వో ను కూడా ఈ వైసీపీ నేతలు చంపేశారని అన్నారు. జగన్‌కు ఆదాయం ఎక్కడ ఎక్కువ వస్తుందో అక్కడికీ వెళ్తారని అన్నారు. ప్రజల డబ్బులను లూటీ చేయడానికే జగన్ పేపర్, టీవీలు పెట్టారని అన్నారు.
ప్రజలంటే జగన్ కు ఏమాత్రం ప్రేమలేదని, ప్రజల డబ్బును దోచుకోవడానికే ఆయన రాజకీయాల్లోకి వచ్చారని ఆరోపించారు. ఈ క్రమంలోనే ఆయన అక్రమంగా ఎన్నో ఆస్తులు సంపాదించారని అన్నారు. జగన్‌కు హైదరాబాద్‌లో ఒక ఇల్లు.. విశాఖలో, తాడేపల్లిలో ప్యాలెస్‌లు ఉన్నాయని అన్నారు. కేవలం రెండు నెలల్లో వాటన్నిటినీ లాక్కుంటామని లోకేశ్ వార్నింగ్ ఇచ్చారు. విశాఖ రాజధాని అని ఎప్పుడు చెప్పాడో అప్పటి నుంచి ఇక్కడ అనేక విధ్వంసాలు జరుగుతున్నాయని అన్నారు. మద్యపానం నిషేధం చేశాకే ఎన్నికల్లో ఓట్లు అడగటానికి వెళ్తానని జగన్ అన్నారని, కానీ అదేమీ లేకుండానే జగన్ ఎన్నికలకు సిద్ధమవుతున్నారని అన్నారు.