పార్టీకి రాజీనామా చేస్తున్నా.. వైసీపీ ఎంపీ ప్రకటన

Update: 2024-01-13 13:58 GMT

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు సంచలన ప్రకటన చేశారు. వచ్చే నెల రెండో వారంలో తాను వైసీపీకి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. ఎంపీగా గెలిచాక దాదాపు నాలుగేళ్ల తర్వాత రఘురామ కృష్ణరాజు తన సొంత నియోజకవర్గమైన భీమవరం చేరుకున్నారు. రోడ్డు మార్గాన వచ్చిన ఆయనకు టీడీపీ, జనసేన నేతలు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సొంత నియోజకవర్గానికి రాకుండా తనను ఇన్నాళ్లు ఇబ్బందిపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ, జనసేన కలిసిన రోజే ఏపీలో వైసీపీ పని అయిపోయిందని అన్నారు. ఇంకో 15 రోజుల్లో జనసేన, టీడీపీ మధ్య అధికారికంగా పొత్తు కుదరనుందని అన్నారు. ఆ తర్వాత బీజేపీ కూడా వీరితో కలుస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమి తరఫున పోటీ చేడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. కాగా రఘురామ కృష్ణరాజు వైసీపీ నుంచి ఎంపీగా గెలిచినప్పటికీ మొదటి నుంచి సీఎం జగన్ మోహన్ రెడ్డి వ్యవహార శైలిపై విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీ కార్యకలాపాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. వీలు చిక్కినప్పుడల్లా వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.


Tags:    

Similar News