RGV : పవన్ ను మరోసారి టార్గెట్ చేసిన ఆర్జీవీ.. ఏమన్నారంటే?
Byline : Vijay Kumar
Update: 2024-01-27 16:32 GMT
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటారు. ఏపీ రాజకీయాలపై ఆయన ఎక్కువ ఫోకస్ పెడుతుంటారు. తన అభిమాన నేత సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఈగ వాలినా సరే ట్విట్టర్ వేదికగా దుమ్ములేపుతుంటారు. తాజాగా ఏపీలో నెలకొన్న రాజీకయ పరిస్థితుల నేపథ్యంలో ఆర్జీవీ స్పందించారు. ట్విట్టర్ వేదికగా మరోసారి జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేశారు. ఈ మేరకు ఆయన ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. టీడీపీ సీఎం చంద్రబాబు నాయుడు, వైసీపీ సీఎం జగన్, బీజేపీ సీఎం పురుంధేశ్వరి, కాంగ్రెస్ సీఎం షర్మిల, అలాగే జనసేన సీఎం సీఎం సీబీఎన్ (చంద్రబాబు నాయడు) అంటూ సెటైరికల్ గా ట్వీట్ చేశారు.