Sharmila Son Marriage : కుమారుడి పెళ్లి ఫోటోలు షేర్ చేసిన షర్మిల
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి మ్యారేజ్ రాజస్థాన్‌లోని జోధ్‌పుర్ ప్యాలెస్‌లో శనివారం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో షర్మిల కుమారుడి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లిలో భాగంగా నిర్వహించిన ‘హల్దీ’ వేడుక ఫొటోలను వైఎస్ షర్మిల సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన విషయం తెలిసిందే. కాగా షర్మిల తాజాగా తన కుమారుడి పెళ్లి ఫోటోలను ఎక్స్ వేదికగా షేర్ చేసి ఎమోషనల్ అయ్యారు. "ఒక తల్లిగా నా జీవితంలో మరో సంతోషకరమైన క్షణం..ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన క్షణం రానే వచ్చింది, ఆత్మీయుల శుభాకాంక్షలు, ఆశీర్వాదం, సర్వశక్తిమంతుడి అనంత కరుణ. నా కొడుకు తన జీవితపు ప్రేమ (ప్రియా)తో వివాహం చేసుకున్నందున కొన్ని అద్భుతమైన జ్ఞాపకాలు కలకాలం గుర్తుండిపోతాయి" అంటూ ఎమోషనల్ అయ్యారు.
ఇక షర్మిల షేర్ చేసిన ఫోటోల్లో ఈ ఫొటోల్లో నూతన దంపతులు రాజారెడ్డి-ప్రియా, వైఎస్ విజయమ్మ, షర్మిల-అనిల్ దంపతులు, కూతురు అంజలి, వధువు అట్లూరి ప్రియా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఉన్నారు. అయితే ఫిబ్రవరి 16న మొదలైన మూడు రోజుల పెళ్లి వేడుకలు ఆదివారం ముగిశాయి. ఇప్పటికే సంగీత్, మెహందీ, పెళ్లి వంటి కార్యక్రమాలు బంధువులు, సన్నిహితుల సమక్షంలో సందడిగా జరిగాయి. ఆదివారం సాయంత్రం తలంబ్రాలు, విందు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. కాగా షర్మిల కుమారుడి వివాహానికి ఆమె సోదరుడు, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది.