టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకు తృటిలో తృటిలో ప్రమాదం తప్పింది. ఉమ్మడి తూర్పు గోధావరి జిల్లా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోని కాతేరులో టీడీపీ నిర్వహించిన 'రా కదలిరా' సభకు చంద్రబాబు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అయితే చంద్రబాబుకు దండ వేసేందుకు ఒక్కసారిగా పార్టీ కార్యకర్తలు, నేతలు స్టేజీ మీదకు వచ్చారు. చంద్రబాబుకు కోసం వారంతా ఒక్కసారిగా స్టేజీ మీదకు రావడంతో తోపులాట జరిగింది. ఈ క్రమంలోనే చంద్రబాబు స్టేజీ పైనుంచి కిందపడబోయారు.
అయితే వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది చంద్రబాబును కిందపడకుండా పట్టుకున్నారు. దీంతో ఆయనకు ప్రమాదం తప్పింది. కాగా ఈ ఘటనపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. టీడీపీ అంటే క్రమశిక్షణకు మారుపేరని, ఇలా క్రమశిక్షణ తప్పి స్టేజీ మీదకు వచ్చి ఇబ్బంది కలిగిస్తే ఎలా అని పార్టీ ముఖ్య నేతలతో అన్నట్లు సమాచారం. మున్ముందు ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని వారిని ఆదేశించినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.