Election Commission : ఈ నెల 9న ఏపీకీ సీఈసీ బృందం రాక

Byline :  Vijay Kumar
Update: 2024-01-02 15:43 GMT

అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధత కోసం ఈ నెల 9, 10 తేదీల్లో సీఈసీ బృందం ఏపీకి రానుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సన్నద్ధత కోసం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు మరోసారి ఏపీ అధికారులతో సమావేశం కానున్నారు. సీఈసీ రాజీవ్ కుమార్ నేతృత్వంలో ఎన్నికల కమిషనర్లు అనూప్ చంద్రపాండే, అరుణ్ గోయెల్ కూడా రాష్ట్రానికి వచ్చే అవకాశమున్నట్లు సమాచారం. ఏపీ సీఎస్, డీజీపీ సహా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో కేంద్ర ఎన్నికల బృందం సమావేశం కానుంది. 2024 ఓటర్ల జాబితా రూపకల్పన, ఓటర్ల జాబితాలో మార్పులు, అవకతవకల అంశం, ఈవీఎంల ఫస్ట్ లెవల్ చెక్ పై మరోసారి సమీక్ష నిర్వహించనున్నారు. అక్రమ మద్యం, నగదు అక్రమ రవాణా, చెక్ పోస్టుల ఏర్పాటు, శాంతిభద్రతల అంశంపై చర్చించనున్నారు. 

Tags:    

Similar News