ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా షర్మిల

Byline :  Vijay Kumar
Update: 2024-01-16 09:29 GMT

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల నియామకం అయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే ఉత్తర్వులు జారీ చేశారు. షర్మిల నియామకం తక్షణమే అమలులోకి వస్తుందని ఏఐసీసీ ప్రకటించింది. ఇక నిన్నటి దాక ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న గిడుగు రుద్ర రాజును కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీలో ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించారు. ఈ సందర్భంగా ఏపీ అధ్యక్షుడిగా రుద్ర రాజు సేవలను ఏఐసీసీ కొనియాడింది. కాగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న గిడుగు రుద్రరాజు నిన్న తన అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. దీంతో ఏపీ పీసీసీ చీఫ్ గా షర్మిల నియామకం లాంఛనమైంది. ఇవాళ ఆమెను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది.

కాగా వైఎస్ఆర్టీపీ చీఫ్ గా ఉన్న షర్మిల ఇటీవల తన పార్టీని ఏఐసీసీ చీఫ్ ఖర్గే, పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. అదే రోజు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పార్టీ తనకు ఏ బాధ్యతలు అప్పజెప్పినా మనస్ఫూర్తిగా చేస్తానని షర్మిల ప్రకటించారు. అయితే ఆమెను ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా నియమించనున్నారని వార్తలు వచ్చాయి. ఆ వార్తలను నిజం చేస్తూ కాంగ్రెస్ అధిష్టానం షర్మిలకు కీలక బాధ్యతలు అప్పజెప్పారు. 

Tags:    

Similar News