ఏపీ విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని కోరుతూ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ప్రధాని మోడీకి బహిరంగ లేఖ రాశారు. 2014లో ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం తీసుకొస్తే ఇప్పటి వరకు అందులో పేర్కొన్న హామీలు అమలు కాలేదని అన్నారు. విభజన చట్టంలోని ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా వంటి ఎన్నో సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయని అన్నారు. ఏపీ అభివృద్ధి కోసం టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు చేసిందేమీ లేదని అన్నారు. ఏపీ సమస్యలను పరిష్కరించాలని ఐదున్నర కోట్ల ఏపీ ప్రజల తరఫున తాను లేఖ రాస్తున్నట్లు తెలిపారు. ఏపీ విభజన చట్టానికి సంబంధించిన అంశాన్ని రేపు పార్లమెంట్ లో ప్రస్తావించాలని, అందుకు ఈ అంశాన్ని రాష్ట్రపతి ప్రసంగంలో చేర్చాలని ప్రధానిని షర్మిల కోరారు. ఇక ఏపీ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం అవిశ్రాంతంగా కొనసాగుతుందని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు.