గ్రూప్-4 ఫ‌లితాలు విడుదల

Byline :  Vijay Kumar
Update: 2024-02-09 16:08 GMT

టీఎస్పీఎస్సీ గ్రూప్-4 ఫలితాలు విడులయ్యాయి. ఈ మేరకు మెరిట్ జాబితా విడుద‌ల చేసిన‌ట్లు టీఎస్‌పీఎస్సీ వెల్ల‌డించింది. గ్రూప్-4 కింద 8,180 ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ వెలువడిన సంగ‌తి తెలిసిందే. 7,26,837 మందిని మెరిట్ జాబితాలో పేర్కొన్నారు. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీపై దృష్టి పెట్టింది. ఇటీవలే నర్సింగ్ ఆఫీసర్ల నియామకం చేపట్టిన రేవంత్ సర్కార్ తాజాగా గ్రూప్-4 ఫ‌లితాలను రిలీజ్ చేసింది. త్వరలోనే నియామక ప్రక్రియను చేపడతామని టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఫలితాల కోసం సంస్థ వెబ్ సైట్ https://www.tspsc.gov.inని సంప్రదించాలని కోరింది.

Tags:    

Similar News