MLC Kavitha : మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలి: ఎమ్మెల్సీ కవిత

Byline :  Bharath
Update: 2023-12-30 08:50 GMT

సమ్మక్క సారక్క జాతరకు జాతీయ హోదా కల్పించాలని, మేడారంకు వచ్చే ప్రజలకు సౌకర్యాలు కల్పించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా బస్సు సౌకర్యాలు కల్పించి, ఫ్రీ బస్సులు సంఖ్య పెంచాలని సూచించారు. మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలని కేంద్రానికి గతంలో చాలాసార్లు విజ్ఞప్తి చేశామని, కానీ ఇంతవరకు తమ ప్రతిపాదనను పట్టించుకోలేదని అన్నారు. ఇవాళ హన్మకొండలోకి బీఆర్ఎస్ కార్యాలయంలో మాట్లాడిన కవిత.. కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుపై విమర్శలు గుప్పించారు. ఆరు గ్యారంటీల విషయంలో ప్రజల్లో చాలా సందేహాలు ఉన్నాయన్నారు. పార్టీ అధికారంలోకి రాలేదని బీఆర్ఎస్ కార్యకర్తలు నిరాశ చెందొద్దని సూచించారు. రాజకీయాల్లో ఒడిదుడుకులు ఉంటాయని, ఇలాంటి పరిస్థితుల్లో ఓపికగా ఉండాలని చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం 44 లక్షల మందికి ఇస్తున్న రూ.4 వేల పించన్లను పెంచి, ఆ తర్వాత కొత్త వాటికి దరఖాస్తు తీసుకుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలపై ప్రజలకు చాలా సందేహాలు ఉన్నాయని అన్నారు. అన్ని వివరాలు అడిగి.. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. బ్యాంక్ అకౌంట్ వివరాలు మళ్లీ అడుగుతారా? లేక ఈ దరఖాస్తులతో కాలయాపన చేస్తారా చెప్పాలని కాంగ్రెస్ ను అడిగారు.




Tags:    

Similar News